అర్ధనగ్నంగా వినూత్నంగా ధర్నాతో నిరసన ఎమ్మార్వోకి వినతిపత్రం

  • ప్రభుత్వ జూనియర్ కళాశాలను కో ఎడ్యుకేషన్ కళాశాలగానే కొనసాగించాలి
  • కొత్తగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ బాలికల కళాశాలలను అదనంగా ఏర్పాటు చేయాలి
  • ఐక్య విద్యార్థి, ప్రజా సంఘాలు పి.డి.ఎస్.యు, టి.ఎన్.es.ఎఫ్, ఏ.ఐ.ఎస్.ఎప్, జనసేన డి.హెచ్.పి.es

సత్యసాయి జిల్లా, మడకశిర మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలను కో ఎడ్యుకేషన్ కళాశాలగా కాకుండా చేయడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, కొత్తగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలపకుండా మడకశిర ప్రాంతంలోనే అదనంగా ఏర్పాటు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందే అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాల రూపంలో అధికారులకు విన్నవించిన ప్రభుత్వ అధికారులు మాత్రం దీని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కళాశాలలో మొత్తం దాదాపుగా 500 మంది విద్యార్థుల వరకు చదువుకుంటున్నారు అకస్మాత్తుగా కో ఎడ్యుకేషన్ కళాశాలను తీసివేస్తూ జీవో నెంబర్ 85ను విడుదల చేయడం దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కొత్తగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను మడకశిర ప్రాంతంలోని అదనంగా ఏర్పాటు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ అంబేద్కర్ సర్కిల్ నుంచి మడకశిర తహసిల్దార్ ఆఫీస్ వరకు అర్ధనగ్న ప్రదర్శనగా వెళ్లి మడకశిర తహసిల్దార్ కి వినతిపత్రాన్ని అందించడం జరిగింది. ఈ విషయంపై స్పందించినటువంటి వృక్ష తాసిల్దార్ ఆనంద్ కుమార్ తక్షణమే విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు ఉమేష్ నాయక్ నవీన్ హరి లోకేష్ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మురళి వినయ్ రంగస్వామి జనసేన పార్టీ మండల నాయకులు టి.ఏ శివాజీ, ఆర్.కళ్యాణ్ కుమార్, టి.యశ్వంత్, ఉమర్ ఫరూక్, సుధాకర్, శ్రీనివాసులు, డి హెచ్ పి ఎస్ నాయకులు హనుమంతు రఘు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.