సి.బి.ఐ దత్తపుత్రులందరు పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అంటున్నారు

  • పత్రికా సమావేశంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజి

కాకినాడ రూరల్, కాకినాడలో పాత్రికేయ సమావేశంలో ఆదివారం రోజున పరుచూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా కార్యక్రమం, బహిరంగ సభగా మారి విజయవంతం అయిన తీరు చూసి కొద్దిమంది వైసీపీ మంత్రులు మొరాగడాన్ని ఖండించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. మీడియాతో మాట్లాడుతూ… ఆదివారం పరుచూరులో పవన్ కళ్యాణ్ యాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఆయన ప్రజల్లోకి వెళ్తుంటే కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని, ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ చేయవలసిన పనిని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేస్తుంటే మీరు పాంట్ లు తడుపుకుంటున్నారు. ఈ కుక్కల్ని ఎక్కువగా మొరగద్దు అని చెప్తున్నా… జగన్ మోహన్ రెడ్డి ఒక పులి అని చెప్తున్నారు. దయచేసి ఆ పులిని విశాఖ జూలో వదిలిపెట్టండి. కోనసీమలో సుమారు 5 వేల ఎకరాల్లో, 5 మండలాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. రైతులు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లాలంటే బయపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడప కి కార్యక్రమానికి పోలీసు సహకారం లేకుండ వెళితే మహిళలే తిరగబడి తిడతారు. జోగి రమేష్ మాట్లాడుతున్నారు ఆయన ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. ఆనాడు జూపూడి ప్రభాకర్ శెట్టిబలిజ యువత గురించి ఆకారణంగా నిందించినపుడు నీవు, వేణు గోపాలకృష్ణ, బోస్ మీరంతా నిద్రపోతున్నారా? మీరందరు బి.సి లకు అన్యాయం చేస్తున్నారు. సి.బి.ఐ దత్తపుత్రులందరు పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అంటున్నారు. మీకు దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టండి. బి.జె.పి నుండి పైసా తెచ్చారా అని మమ్మల్ని అడుగుతున్నారు. మాకు పనేంటి అని అడుగుతున్నా మీ పై ఉన్న కేసులకు బయపడి మీరు రూపాయి తేలేదు.. మేము తేలేము అని చెబితే మా అధ్యక్షులు వారు ప్రయత్నం చేస్తారు. అంబటి రాంబాబు దయచేసి మీరు పోలవరం పై దృష్టి పెట్టండి. పూడికలు తీయక, నీరు సకాలంలో ఇవ్వక కరప మండలంలో రైతులు నష్ట పోయారు. 272 మందికి రైతు భరోసా పేరిట లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ ది. వ్యవసాయ శాఖ మంత్రి ఏమి చేస్తున్నారు? మీరు డమ్మీ కుక్కల ఉన్నాం అని ఒప్పుకోండి. సజ్జలకి చెప్పండి మీ మంత్రిత్వ శాఖలకి సంబంధించిన పనులు అప్పగించమని ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా దించేస్తే ఆంధ్రప్రదేశ్ కి అంత మంచిదని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల గోవింద్, బండారు మురళి, ముసలయ్య, ముద్రగడ రమేష్, బుజ్జి, ప్రసాద్, సంతోష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.