ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మంది క్రియాశీలక సభ్యులు లక్ష్యం

*గ్రామస్దాయిలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులను చేర్చుకోవడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ సూచించారు.

చిత్తూరు, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ జిల్లాలో 4 రోజుల విస్తృత పర్యటనలో భాగంగా, రెండవ రోజు పర్యటన మదనపల్లి నియోజకవర్గంలో ఇన్చార్జ్ శ్రీమతి గంగారపు స్వాతి ఆధ్వర్యంలో, రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ నేతృత్వంలో జరిగిన మండల కమిటీ సభ్యుల సమీక్షా సమావేశంలో జిల్లా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి మండల అధ్యక్షులకు దిశానిర్దేశం చేసి 2024 లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేయడానిక గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసే దిశగా విది విధానాలను అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాలు నిర్వాహక కమిటీ కో ఆర్డినేటర్ పగడాల మురళి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు తులసి ప్రసాద్ గారు,శివరాం జంగాల, జిల్లా కార్యదర్శులు దేవర మనోహర, నసీర్, సనావుల్ల మరియు మదనపల్లి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.