మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టిన బండారు

  • ఆలమూరు మండలంలో 18 గ్రామాలలో జనసేన పార్టీ గ్రామ కమిటీలను అత్యంత బలోపేతం చేసిన వారికి సన్మానం చేసిన బండారు శ్రీనివాస్ నియోజవర్గం.

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలంలోని, ఆలమూరు టౌన్ హాల్ నందు రాత్రి 8 గంటలకు ప్రారంభమై, రాత్రి 11 గంటల వరకు జనసేన పార్టీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ప్రముఖ నాయకులు, జనసైనికులు, జిల్లా కార్యదర్శులు, కార్యకర్తలతో, కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జి బండారు శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలమూరు మండలంలోని 18 గ్రామాలలోని, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులకు పూలమాలలతో సన్మానం చేసి, వివిధ బాధ్యతలు అప్పచెబుతూ, జనసేనానికి అనుక్షణం అండగా ఉండాలని, ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ, చేర్చుకుంటూ ముందుకు సాగాలని, జనసేనాని ఆశయాలు నచ్చి, మెచ్చిన వారిని, కంటికి రెప్పలా కాపాడుకుంటూ, అన్ని వర్గాల వారిని ఆదరిస్తూ, జనసేనాని అందరూ వాడని నిరూపిస్తూ విజయం వైపు నడిపించాలని, ముందుకు సాగాలని 18 గ్రామాల, గ్రామ కమిటీల అధ్యక్షులకు, సభ్యులకు, కార్యకర్తలకు సూచనలు తెలియజేశారు. అనంతరం బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ రెండవ తారీఖు సందర్భంగా, వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కలుగచేయాలని, నా స్వగృహం వాడపాలెం టు వాడపల్లి వెంకన్న సన్నిధికి పాదయాత్రను, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలతో కలిసి, ఆ రోజు ఉదయం 5 గంటలకు కాలినడకతో బయలుదేరి, వెంకన్న సన్నిధి వాడపల్లికి చేరుకుని పూజలు చేస్తూ, జనసేనాని పవన్ కళ్యాణ్ వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఎన్నికలనే యుద్ధభూమికి వీరుడుగా సమరశన్ఖంతో సమాయత్తం కావాలని ఆకాంక్షిస్తూ, అక్టోబర్ నెలలో విజయదశమి సందర్భంగా వారు చేసే బస్సు యాత్ర కూడా నిరాటాఒకంగా విజయవంతం కావాలని, జనసేనానికి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు తోడై, నీడై, గెలుపు ముందుకు, కాబోయే రేపటి ముఖ్యమంత్రిగా తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి ముఖ్యమంత్రిగా మా నాయకుడిని చూడాలని, నీతికి నిజాయితీకి నిలబడ్డ పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే, న్యాయం ధర్మం తప్పక గెలుస్తుందని, పేదవాడి ఆకలి బాధలు తీరుతాయని, కచ్చితంగా గెలవాలని, బండారు శ్రీనివాస్ కోరుతున్నానని తెలియజేశారు. సెప్టెంబర్ 2న జనసేనాని పుట్టినరోజు సందర్భంగా ఈ నా పాదయాత్ర కార్యక్రమమును విజయవంతంగా నిర్వహించతలపెట్టి ఉన్నానని, మీ అందరి సహకారం కావాలని కోరుతున్నానని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో నా వెంట నడిచి, మీకు మేమున్నామని నాకు మద్దతును తెలియజేయాలని, మనమంతా నిజాయితీకి నిలబడ్డ జనసేనానికి ఎప్పుడు తోడుగా ఉంటామని సందేశం ఇద్దామని, ప్రతి ఒక్కరూ రావాలని, నా వెంట పాదయాత్రలో కదం తొక్కుతూ ముందుకు సాగాలని కోరుచున్నానని తెలియజేశారు.