ఘనంగా వంగ లక్ష్మణ్ గౌడ్ జన్మదిన వేడుకలు

మదిర, బోనకల్ మండల కమిటీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ ఘనంగా జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా బోనకల్ మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ యంగ్ డైనమిక్ లీడర్ యూత్ కి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మా అభిమాన నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద పోరాడుతు పార్టీ బలోపేతం గురించి అహర్నిశలు కష్టపడుతూ జనసేన పార్టీ యువజన విభాగాన్ని ముందుకు తీసుకెళ్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఏ పార్టీ చేయని విధంగా ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ యువజన విభాగాన్ని వివిధ రాజకీయ పార్టీలకు వివిధ రాజకీయ నాయకులకు ఒక దమ్మున్న జనసేన పార్టీ యువజన విభాగాన్ని చూపిస్తూ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారని వారి నాయకత్వంలో మదిర నియోజకవర్గం జనసైనికులు పార్టీ బలవంతం గురించి అహర్నిశలు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా నాయకులు, సజ్జనపు భరత్, మండల్ నాయకులు, ఎస్కే జానీ, పాషా, నరసంశెట్టి నరేష్ ,మోదుగు, పవన్, తదితరులు పాల్గొన్నారు.