నిరుపేద పిల్లల చదువుకు సాయమందించిన బెల్లంకొండ అనిల్

పల్నాడు జిల్లా, నరసరావుపేట లోని స్థానిక కొండలరావు పేట నివసిస్తున్న నిరుపేద కుటుంబం అయిన శిరమలేని అపర్ణ వారి పిల్లన్నీ చదివించే సోమత లేక ఆర్దికంగా ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలిసిన జనసేన నాయకుడు బెల్లంకొండ అనిల్ వారి కష్టాన్ని చూడలేక తక్షణమే వారిపిల్లలకు చదువు కోవడానికి నోట్ బుక్స్ మరియు ఆర్థిక సాయం చేసారు. పిల్లల చదువుకు ఏ అవసరం ఉన్నా తన ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ నాగుల్ మీరా, ఆర్ కే యాదవ్, గుప్తా శ్రీకాంత్, గుండాల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.