అట్లాంటాలో బీమ్లానాయక్ జోరు.. డే వన్ నుంచి తగ్గేదేలే అంటున్న పవన్ ఫ్యాన్స్

*భీమ్లా నాయక్‌ థాంక్యూ నోట్ ఫ్రం అట్లాంట పి.ఎస్.పి.కె ఫాన్స్

అట్లాంట, భీమ్లా నాయక్ ప్రీమియర్ షో విజయవంతమయిన సందర్భంగా అట్లాంట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ థాంక్యూ నోట్ ద్వారా తమ కార్యక్రమం విజయవంతమవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

మునుముందుగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు.

అలాగే పవన్ కళ్యాణ్ ప్రతీ సినిమా ప్రీమియర్ షో ఒక వినూత్న శైళిలో, వైవిద్యభరితంగా మరియు రికార్డ్ లు తిరగరాస్తూ చేయగలుగుతున్నాము అంటే అది అట్లాంట అభిమానుల అండదండలే. వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
 
భీమ్లా నాయక్‌ అట్లాంట ప్రిమియర్ షో రికార్డ్స్:

  1. లక్ష క్రాకర్స్ – అమెరికా చరిత్రలోనే ఇంత బారీఎత్తున బాణాసంచా కాల్చడం మన పవన్ కళ్యాణ్ గారి సినిమాతోనే సాద్యం అయ్యింది. పదకొండు వందల డాలర్లు స్పాన్సర్ చేసిన వెంకట్ అయినాబత్తిన (విన్ని రావ్) గారికి మా హృదయ పూర్వక అభినందనలు.
  2. రోజ్వెల్ సిటీ కౌన్సిల్ నుండి క్రిస్టీన్ హాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి చక్కటి ప్రసంగం ఇవ్వడం జరిగింది. వారిని శ్రీమతి అర్చనా రెడ్డి గారు కాశీ కండువాతో సత్కరించడం జరిగింది. అంతేకాకుండా అభిమానుల సమక్షంలో వారుకూడా సినిమా మొత్తం చూడడం జరిగింది.
  3. తొమ్మిది అడుగుల నిలువెత్తు కటవుట్ – డిజిమేక్స్ ధియేటర్ ముందు హమ్మర్ వాహనం పై కటవుట్ అభిమానులను అబ్బుర పరిచింది.
  4. హాట్ బ్రెడ్స్ వారు ఎంతో అభిమానంతో ముందుకు వచ్చి ఫుల్ షీట్ కేక్ స్పాన్సర్ చెయ్యడం జరిగింది.
  5. సుమారు 150 భీమ్లా నాయక్‌ టీ షర్ట్స్ మరియు 100 కాశీ టవల్స్ అభిమానులకు అందజేయడం జరిగింది. సమయానికి తగిన డిజైన్స్ చేయడం మరియు మొత్తం ప్రోసస్ లో మాకు సహకరించిన రుక్మిణి కోట గారికి, గోపాల్ గూడపాటి గారికి మరియు తమ్ముడు నాగు కూనసాని గారికి మా అభినందనలు.  
  6. కంఫెటీస్ – సుమారు $300 విలువ చేసిన కంఫెటీస్ ధియేటర్స్ లో పేల్చి, సిల్వర్ స్క్రీన్ ముందు అభిమానుల డేన్స్ తో ధియేటర్ దద్దరిల్లిపోయింది.
  7. డక్కన్ స్పైస్ రెస్టారెంట్ వారు స్నేక్స్ స్పాన్సర్ చెయ్యడం జరిగింది.
  8. అమెరికా ధియేటర్స్ లో అభిమానులు ప్రత్యేకించి వేయించుకొన్న బ్యానర్స్ అంటే అది అట్లాంట మాత్రమే. ధియేటర్ లో ప్రతీ చోట సొంత బ్యేనర్స్ ప్రింట్ చేయించి ధియేటర్ మొత్తం బ్యానర్ మయం చేసిన అభిమానుల అభిమానం గురించి ఎంత చెప్పినా తక్కువే.
  9. పవన్ కళ్యాణ్ ప్రతీ సినిమాకి వారం ముందు నుండి డైలి క్విజ్ పెట్టడం అనవాయితీ. సుమారు 8 మంది విజేతలకు $5 గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది.
  10. ప్రైం9 టి.వి చానెల్ వారు అట్లాంట ప్రీమియర్ హంగామాని లైవ్ ప్రసారం చెయ్యడం జరిగింది. వారికి మా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా మిత్రులు వర్మ గారికి నా నమస్కారములు.

స్పాన్సర్స్ వివరాలు:

  1. కరోతు సురేష్ – $100
  2. రవి యెళిశెట్టి – $100
  3. రాఘవ బోగాది – $100
  4. వెంకట్ కృష్ణ మర్రిఊడి – $100
  5. కృష్ణ మేకల – $100
  6. వెంకట్ అయినాబత్తిన (విన్నీ రావ్) – $1100
  7. మహా రాణా – $100
  8. సాయిరాం కారుమంచి – $100
  9. నాగ పునీత్ చందు – $100
  10. వెంకట్ చెన్నుబొట్ల – $100
  11. హేమంత్ పెనుమత్స – $50
  12. అర్చన రెడ్డి – $50
  13. వెంకట్ జిడుగు – $100
  14. చిన్మయ మంచాల – $200
  15. వెంకట్ గోక్యాడ – $100
    15, మని జోగరావ్ చీకరమెళ్ళి – $100
    వీరందికి మా హృదయపూర్వక అభినందనలు.

“ఆడ కాదు ఈడ కాదు…
అమీర్పెట ధియేటర్ కాదు…
అమెరిక గడ్డ మీద,
డిజిమేక్స్ ధియేటర్ లోన,
దద్దరిళ్ళిన పికె ఫాన్స్.
శభాష్ భీమ్లా నాయక్‌!”

ఇట్లు,
అట్లాంట పి.ఎస్.పి.కె ఫాన్స్.