కూకట్ పల్లి జనసేన కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

కూకట్ పల్లి నియోజకవర్గంలో  కె.పి.హెచ్.బి కాలనీలో జనసేన పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా తుమ్మల మోహన్ కుమార్    ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ వీరమహిళ వైస్ ప్రెసిడెంట్ నిహారిక విచ్చేసి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు మరియు కేక్ కటింగ్ చేసి వేడుకలు జనసేన పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 114 డివిజన్ ప్రెసిడెంట్ కొల్ల శంకర్, జనసేన పార్టీ వీర మహిళా విభాగం ముంతాజ్, భాగ్యలక్ష్మి, మహాలక్ష్మి, అంజి మరియు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.