బిక్కవోలు మండల జనసేన కార్యవర్గ సమావేశం

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండల జనసేన కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు ఇందల వీరబాబు ఆధ్వర్యంలో మేల్లూరు గ్రామంలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, మట్లాడుతూ గ్రామాకమిటీలు గురించి పార్టిబలోపేతానికి తీసికోవలసిన చర్యలుగురించి దిశా..నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త నాగు, గ్రామ నాయకులు కిట్టిబాబు, నాగబాబు, జనసేన ఎంపిటిసి అభ్యర్థి వీర రాఘవులు, జనసేన వార్డు నెంబర్లు నాగసూరన్న, నరసింహరాజు, కొర్ల వీరబాబు, బచ్చల పవన్, మండల కమిటీ సభ్యులు, అనేక మంది మండల నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి కిట్లు కూడా పంపిణీ చేశారు. ఆ గ్రామ దళితవాడకు చెందిన యువకులు పెద్దలు పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి దళిత సోదరులు బచ్చల పవన్ ఆధ్వర్యంలో 20 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారికి ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కండువా వేసి స్వాగతం పలికారు.