జగనాసుర పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడు తల్లి – అమ్మవారిని వేడుకున్న జనసేన పార్టీ నేతలు

గుంటూరు, రాష్ట్రంలో మూడేళ్ళుగా విధ్యంసకర పాలన కొనసాగుతుందని, ముఖ్యమంత్రి జగనాసుర పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుతల్లి అంటూ జనసేన పార్టీ నాయకులు శ్రీ కన్యకాపారమేశ్వరి అమ్మవారిని వేడుకున్నారు. దసరా పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచన మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అమ్మవారికి పంపిన సారెను జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు దంపతులు అమ్మవారికి సమర్పించారు. పూలమార్కెట్ నుంచి కన్యకాపారమేశ్వరి దేవాలయం వరకు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి సారెను అందచేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ తమ అరాచకపాలనతో , అవినీతితో కున్నారిల్లింప చేశారని, ప్రజలకు భవిష్యత్ లేకుండా చేస్తున్నారని ఇలాంటి దుర్భర పరిస్థితుల రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని కోరుకున్నట్లు నేరేళ్ళ సురేష్ తెలిపారు. గుంటూరులో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కన్యకాపారమేశ్వరి దేవాలయ శతజయంతి మహోత్సవాల సందర్భంగా ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారని రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలి అంటే అది ఒక్క పవన్ కళ్యాన్ తోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో జనసేనకు విజయాన్ని చేకూర్చమని అమ్మవారిని కోరుకున్నట్లు మార్కండేయ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ దాసరి లక్ష్మీదుర్గ, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ప్రధాన కార్యదర్శి ఉప్పు రత్తయ్య, నగర ప్రధాన కార్యదర్శి చింతా రాజు, యడ్ల మల్లి, బండారు రవీంద్ర, చెన్నా పోతురాజు, నాగేంద్ర సింగ్, పాములూరి కోటి, చేజర్ల శివకుమార్, కిట్టూ, కవిత, మల్లేశ్వరి, యడ్ల రాధిక, ఆసియా, బాషా, షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.