ఇసుక పాలసీతో కోట్లు దండుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి: గాదె

గుంటూరు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, చట్టాల త్రినాద్, ఆళ్ళ హరి, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మ, శిఖా బాలు, మధు లాల్, నెల్లూరు రాజేష్, సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. అవినీతి లేని, పారదర్శక ప్రభుత్వం మాది అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డిని జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం, అవినీతి లేదు అని చెప్పే మీరు రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఇసుక అవినీతి మీ ఇంటి చుట్టూనే ముడిపది ఉన్న మాట వాస్తవం కాదా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మైనింగ్ కోసం కొత్త పాలసీ తెస్తున్నాం అని చెప్పి సంవత్సర కాలం పటు ఇసుక లేకుండా చేసారు. పోనీ ఆ కొత్త పాలసీ వల్ల అందరికీ మంచి జరుగుద్ది అని ప్రజలందరూ ఆశపడ్డారు. కానీ మట్టిని దోచుకోవడానికి మీరు ప్రణాళికలు రచించుకునేందుకే సంవత్సర కాలం సమయం తీసుకున్నారన్న విషయం ప్రజలు ఇప్పుడిప్పేదే తెలుసుకుంటున్నారు. ఆ ప్రణాళికలో భాగమే రాష్ట్రంలో చిత్తూరు కీళ్ల నుండి మొదలుకొని శ్రీకాకుళం వరకు ఉన్న 13 జిల్లాలో ఉన్నటువంటి గోదావరి, కృష్ణ నదులు గాని, ఉపనదులు గాని అక్కడ ఉన్న ఇసుకను తవ్వుకునేందుకు జేపీ వెంచర్స్ అనే సంస్థకి గుంపగత్తుగా ఇచ్చేశారు. మేము జనసేన పార్టీ నుండి అడుగుతున్నాం. అసలు ఆ జేపీ వెంచర్స్ అనేది ఎక్కడిది ? అది ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థా కాదా? ఆ సంస్థ నష్టాల్లో ఉన్న మాట వాస్తవమా కాదా? ఆ జేపీ వెంచర్స్ కింద రాష్ట్రంలో ఉన్న ఇసుక రేవులన్ని తీసుకొచ్చి, మీరే బిడ్లు వేసుకోని తవ్వకాలు చేసుకుంటున్న మాట వాస్తవమా కాదా? జేపీ వెంచర్స్ సంస్థ ప్రభుత్వానికి సంవత్సరానికి 765 కోట్లు కడతామని చెప్పారు. ఇప్పటి వరకు ఎంత కట్టారు అనే విషయాన్నీ ముఖ్యమంత్రి గారు బహిర్గతం చెయ్యగలరా? మాది పారదర్శక పాలన అని చెప్పే మీకు ఆ లెక్కలు చూపించే దమ్ముందా ? ఇసుక తవ్వకాలకు సంబంధించి అప్పటికి ఉన్న శంకర్ రెడ్డి అనే వ్యక్తిని పంపించేసి సుధీర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇసుక రేవులన్ని అప్పజెప్పిన మాట వాస్తవమా కాదా? ఈ సుధీర్ అనే వ్యక్తి వచ్చిన తరువాత ఏ ప్రాంతాల్లో అయితే ఇసుక పెద్ద మొత్తంలో దొరుకుతుందో అక్కడ మీకు సంబందించిన వ్యక్తులకి కాంట్రాక్టులు ఇచ్చుకున్న మాట వాస్తవమా కాదా? మాకు ఉన్న సమాచారం బట్టి గుంటూరు జిల్లా నుండి 20 కోట్లు, కృష్ణా జిల్లా 21 కోట్లు, వెస్ట్ గోదావరి 25 కోట్లు, ఈస్ట్ గోదావరి 30 కోట్లు, శ్రీకాకుళం 15 కోట్లు, నెల్లూరు 20 కోట్లు చిత్తూరు 15 కోట్లు, ప్రకాశం 5 కోట్లు, అనంతపురం 10 కోట్లు, కడప 15 కోట్లు, కర్నూలు 15 కోట్లు ఈ విధంగా సుధీర్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి ఇంటికి ప్రతి జిల్లా నుంచి ఇసుక మాఫియా వాళ్లు డబ్బులు పంపించడం వాస్తవమా కాదా? అసలు ప్రభుత్వానికి ఇసుక తవ్వకాల నుండి డబ్బులు రావట్లేదు అనేది మాకు ఉన్న అనుమానం, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఈ ఇసుక పాలసీకి సంబంధించి ముఖ్యమంత్రికి కట్టాల్సిన 25 కోట్ల పైకం కట్టలేక వెస్ట్ గోదావరికి చెందిన ప్రేమ్ రాజ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి. మార్చి 23న ఎన్.జి.టి కోర్ట్ ఆంధ్ర ప్రదేశ్ అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి, ఎన్.జి.టి రూల్స్, ఎన్విరాన్మెంటల్ రూల్స్ ని పూర్తిగా అతిక్రమిస్తున్నారు కాబట్టి ఈ ఇసుక తవ్వకాలను పూర్తిగా ఆపేయాలని ఆదేశాలు ఇస్తే ఆ ఉత్తర్వులని నాకూడా పక్కన పడేసి ఇంకా ఎక్కువ మైనింగ్ చేస్తున్న మాట వాస్తవమా కాదా? చిత్తూరుకి చెందిన డి హేమ కుమార్ మరియు గుంటూరు జిల్లా పెందకూరపాడు ఎమ్మెల్య్ నంబూరు శంకర్ రావుకి అత్యంత సన్నిహితుడు నాగేంద్ర కుమార్ అని వీళ్లిద్దరు ఎన్.జి.టి కోర్ట్ లో వేసిన పిటీషన్ ఆధారంగా రద్దు ఉత్తర్వులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలకు సంబంధించి 18 కోట్లు జేపీ సంస్థకు పెనాలిటీ వేసిన మాట వాస్తవమా కాదా? ఈ విషయాలపై ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. అది ప్రభుత్వ వ్యక్తుల బాధ్యత. కృష్ణా నది మీద మూడు చోట్ల పూర్తిగా మూడు దార్లు వేసుకొని అక్రమ తవ్వకాలు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు చేస్తున్నారన్న మాట వాస్తవమా కాదా? ఆయన ప్రమాణం చేసి చెప్పాలని అన్నారు.