నిర్వాసిత ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ జనసైనిక కుటుంబానికి అండగా జనసేన

పిఠాపురం నియోజకవర్గము, కందరాడ గ్రామానికి చెందిన బుడగ జంగాల కుటుంబం అయిన కళ్యాణం పెంటయ్య నుకాలమ్మ అను వృద్ద దంపతులు గత 20 సంవత్సరాలకు పైగా స్థానిక చెరువు గట్టుకు ఆనుకుని గతంలో ప్రభుత్వాలు ఇళ్ళ స్థలాలుగా పంచిన భూమి పక్కగా ఒక పూరి పాకలో నివాసం ఉంటున్నారు. వీరివురు స్థానికంగా జరిగిన గత ఎలక్షన్ సమయాన జనసేన సానుభూతి పరులుగా ఉంటున్నారని అసంతృప్తితో రగిలిపోతున్న పాలకపక్ష నేత ఒకరు వీరిని టార్గెట్ చేస్తూ అక్రమ నిర్మాణం అంటూ ఎన్నో ఏళ్లుగా జీవితం వెళ్ళబుచ్చుతున్న పూరి గుడిసెను తొలగించాల్సిందిగా ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తేవడంతో వారిమాటకు తలోగ్గిన ప్రభుత్వ పంచాయితీ సెక్రటరీ తక్షణం పాకను తొలగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చి పోలీస్ కేసు నమోదు చేయించారు. అభాగ్యులైన ఆ వృద్ధ జంటకు అండగా స్థానిక జనసైనికుడు మరియు జనసేన సంయుక్త కార్యదర్శి అయిన మోటూరి మహేశ్వర్ రావు అండగా నిలచి స్థానిక జనసైనికులు మరియు జనసేన నాయకులు అయిన గౌరవ జనసేన ఎంపిటిసి పిల్లా సునీత, పిల్లా దినేష్, వాకపల్లి సూర్య ప్రకాష్ కి వివరము తెలపగా వారు నియోజకవర్గ జనసేన నాయకులకు స్థానిక అధిష్టానానికి తెలపటం జరిగింది. ఈ ఉదంతాన్ని తెలుసుకున్న నియోజకవర్గ జనసేన నాయకులు వెన్నా జగదీష్ , రూరల్ మండల జడ్పిటిసి అభ్యర్థి ఊట ఆదివిష్ణు(నానిబాబు) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక జనసేన నేతలను రూలర్ మండల జనసైనికులను కలుపుకుని పక్షపాత ధోరణితో చేస్తున్న ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నిరాశ్రయ నిర్వాసితులైన ఈ వృద్ధ జంటకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని అలా కేటాయించే వరకు వీరు నివాసం ఉంటున్న గుడిసెను తొలగించటానికి వీలు లేదని అలా కాక ఏ విధమైన తొందరపాటు నిర్ణయం తీసుకున్నా మొత్తం చెరువు పై ఉన్న అక్రమ నిర్మాణాలు అన్నింటినీ తొలగించే వరకూ తాము పోరాటం తీవ్ర స్థాయిలో చేస్తామని హెచ్చరించడంతో పాటు పోలీస్ స్టేషన్కు వచ్చి బాధితులకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. రూరల్ పోలీస్ స్టేషన్ కు నియోజకవర్గంలో ఇతర జనసైనికులు నేతలు వచ్చి ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బాధితులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విరవాడ జనసేన ఎంపీటీసీ అభ్యర్థి రామిశెట్టి సూరిబాబు జనసైనికులు పిల్లా రామ్ కుమార్ గంజి గోవిందరాజు, మోతురి మహేష్, దుర్గ ప్రసాద్, సత్యనారాయణ, సతీష్, సత్తిబాబు, రాజేష్, రాజు, అప్పారావు, రాంబాబు మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.