జనసేన ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజలకు చేర్చే దిశగా.. ఇరగవరం మండలం, ఓగిడి గ్రామంలో రామాలయం వద్ద జనసైనికుడు కానూరి మాధవరాయుడు, జనసైనికులు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్. వై. వి. రావు హాస్పిటల్ వారిచే ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి గ్రామంలో సుమారుగా 55 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.