చార్టర్డ్ అకౌంటెంట్ల భర్తీకి హెచ్‌పీసీఎల్ నోటిఫికేషన్
ముంబైలోని ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చార్టర్డ్ అకౌంటెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 25
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఉత్తీర్ణత.
వయసు: 27 ఏళ్లు మించకూడదు
ఎంపిక విధానం: సీఏ మార్కులు, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31
వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/