‘అంబేద్కర్‌’ వర్సిటీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించింది. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎమ్మెల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి చివరి తేదీని ఈ నెల 17 వరకు పొడిగించింది. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ www.braouonline.inలో చూడవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు సమీప అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా 73829 29570 / 580 / 590 / 600 లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040-2368 0333/555 ఫోన్‌ నంబర్లలో సంప్రందించొచ్చని సూచించింది.