బత్తుల దంపతుల సమక్షంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

  • అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నేతలు, 300 మంది కార్యకర్తలు.. బత్తుల దంపతుల సమక్షంలో జనసేన పార్టీలో చేరిక..

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలంలో అధికార వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీతానగరం గ్రామంలో.. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరిగిన జనసేన పార్టీ సీతానగరం మండల స్థాయి విస్తృత సమావేశంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ కి చెందిన మాల, మాదిగ, బిసి, వైశ్య, వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలు 300 కార్యకర్తలు పెద్ద ఎత్తున బత్తుల దంపతుల సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. సైకో పాలన చేస్తున్న జగన్ సర్కారుపై విరక్తి కలిగి, స్థానిక ఎమ్మెల్యే వ్యవహారశైలి నచ్చక మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తున్న తీరు మరియు రాజానగరం నియోజవర్గంలో బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి పార్టీని అభివృద్ధి చేస్తున్న తీరు, కష్టాల్లో ఉన్న ప్రజలను తక్షణమే ఆదుకుంటున్న విధానం, నాయకులకు, జనసైనికులకు అందరికీ ఆయన ఇస్తున్న గౌరవం ఇవన్నీ నచ్చి బత్తుల దంపతుల సమక్షంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు, కార్యక్రమంలో భాగంగా ముందుగా రాపాక గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీతో బత్తుల దంపతులకు ఘన స్వాగతం పలికిన అనంతరం ముందుగా చినకొండేపూడి గ్రామం చేరుకుని… అక్కడ ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగజ్జివన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించడం జరిగింది. చేరికల వివరాలు ఇలా ఉన్నాయి…

రాపాక గ్రామ వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు నాగవరపు సత్తిబాబు, బత్తుల బలరామకృష్ణ నాయకత్వంపై నమ్మకంతో వారు, వారి అనుచరులు 50 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, అదే గ్రామానికి చెందిన వైసిపి యువ నాయకులు ముత్యాల మహేష్ జనసేన పార్టీలో చేరారు… చినకొండేపూడిపూడి వైసీపీ నాయకులు చిలిపి బ్రహ్మాజీ వారి అనుచరగణంకు చెందిన 50 మంది (ఎక్కువమంది మహిళలు) జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.. సింగవరం నాయకులు పులి దిండి లక్ష్మణ్ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన కార్యకర్తలు 40 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు..కూనవరం గ్రామ నాయకులు మాధవరపు భద్రరావు ఆధ్వర్యంలో 30 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇనుగంటివారిపేట నాయకులు కొండాటి సత్యనారాయణ 20 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు…. ముగ్గుళ్ల గ్రామానికి చెందిన నాయకులు గెడ్డం కృష్ణయ్య చౌదరి ఆధ్వర్యంలో.. వైసీపీకి చెందిన కార్యకర్తలు 30 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, సీనియర్ నాయకులు మద్దాల యేసుపాదం ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 70 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వైసిపి కార్యకర్తలను జనసేన పార్టీలో జాయిన్ చేయడంలోనూ మరియు మండల విస్తృతస్థాయి సమావేశం విజయవంతం కావడంలో మండల సీనియర్ నాయకులు మట్ట వెంకటేశ్వరరావు ను ఈ సందర్బంగా పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, మద్దాల యేసుపాదం, పోసిరత్నాజీ రావు, బండి సత్యప్రసాద్, గడ్డం కృష్ణయ్య చౌదరి, ప్రశాంత్ చౌదరి,చీకట్ల వీర్రాజు, కోనే శ్రీను, చిడిపి బ్రహ్మాజీ, కొండటి సత్యనారాయణ, మాధవవరపు వీరభద్రరావు, దాసరి కోటేశ్వరావు, రొంగల బ్రమ్మనాయుడు, బ్రహ్మాజీ, బయలుపూడి శ్రీను, భారతీయుడు, రవి, చిక్కం నాగేంద్ర పిండి వివేక్, మిర్తిపాడు ప్రసాద్, ప్రగడ శ్రీహరి, రుద్రం కిషోర్, ముగ్గుళ్ల సందీప్, పెంటపాడు శివ, పెరుగు బాబి చీరల శివ, మట్టా సుబ్రమణ్యం, కరాటే బంగారం, నాగర్పు సత్తిబాబు, ముత్యాల మహేష్, వీరమహిళ గోకాడ సూర్యవతి, కిల్లాడి ఎర్రయ్య, ప్రకాష్, అంచూరి సత్యనారాయణ, కవల గంగారం ఇతర నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. అదేవిదంగా నియోజకవర్గం నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, భూపాలపట్నం సర్పంచ్ గుల్లింకల లోవరాజు, సీనియర్ నాయకులు అడ్డాల శ్రీను, మద్దిరెడ్డి బాబులు, బొడ్డపాటి, రావి చిట్టిబాబు, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, చిట్టిప్రోలు సత్తిబాబు, తోరాటి శ్రీను, నాతిపాం దొరబాబు, దొడ్డి అప్పలరాజు, దేవన దుర్గాప్రసాద్, తోట అనిల్ వాసు ఇతర జనశ్రేణులు ఎత్తున పాల్గొన్నారు.