సప్లమెంటరీ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలి

  • పదవతరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్ధుల వద్ద నుండి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలి.
  • జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్.

రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా 2,01,627 (32.74 శాతం) మంది పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడం ప్రభుత్వ వైఫల్యమే. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించడం, పరీక్షల సమయంలో పేపర్లు లీక్ కావడం తదితర కారణాలు విద్యార్ధులపై ప్రభావం చూపాయనడం అందరికీ తెలిసిన సత్యం. విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వ హయాంలో 71 పాఠశాలల్లో ఒక్కరూ పాస్ కాకపోవడం, అందులో 22 ప్రభుత్వ పాఠశాలలే ఉండడం సిగ్గుచేటు. ప్రభుత్వం ఆన్ లైన్ లో విడుదల చేసిన మార్క్స్ షీట్ లలో పాస్ అయిన సబ్జక్టులకు ‘ఎఫ్’ అని, ఫెయిల్ అయిన సబ్జక్టులకు ‘పి’ అని పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా జనసేన పార్టీ భావిస్తోంది. కాబట్టి ఫెయిల్ అయిన విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేయకుండా పూర్తిగా ఉచితంగా సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.