అనంతగిరిలో జనం కోసం జనసేన కార్యాచరణ సమావేశం

  • ఇంటింటా జనసేన కార్యక్రమానికి జనసైన్యం సన్నద్ధం కావాలి

అనంతగిరి: మండలంలోని జనసేన మండల అధ్యక్షులు చిట్టం మురళి, గుజ్జేల మంగళ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన” కార్యక్రమం నిర్వహించడం కోసం కార్యచరణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిట్టం మురళి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను, క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియ చేస్తున్నామని సూచించారు. ఇప్పుడు ఉండే ప్రభుత్వం దోచుకో వడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని వివరించారు. రానున్న ఎన్నికల్లో జనసేన ను ఆదరించడం మీకు మీ పిల్లల భవిష్యత్తుకు బాగుంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.