దువ్వలో జనసేన చలివేంద్రంను ప్రారంభించిన విడివాడ రామచంద్రరావు

తణుకు, జనసేన పార్టీ తణుకు నియోజవర్గం, తణుకు మండలం. దువ్వ గ్రామంలో జనసేన పార్టీ తరపున ఏర్పాటు చేసిన చలివేంద్రంను తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు పట్టణం అధికార ప్రతినిధి పంతం నానాజీ, దువ్వ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీరాముల చిన్ని, లీగల్ సెల్ సెక్రటరీ కొయ్యల విజయ్ కుమార్ మరియు దువ్వ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున విడివాడ రామచంద్రరావు ధన్యవాదములు తెలియజేసారు.