ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పోరాడుతుంది: మనుక్రాంత్ రెడ్డి

  • అందుకే పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు
  • జగన్ సీఎంగా ప్రజలకు కష్టాలు కన్నీల్లే మిగిల్చారు
  • పింఛన్లను దౌర్జన్యంగా తొలగించారు
  • అవ్వతాతలు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్లు తొలగించేందుకు మనసెలా వచ్చింది

ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుందని, అందుకే ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ అన్నారు, బుధవారం జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆధ్వర్యంలో 27వ డివిజన్ నుంచి ఉదయ్ కిరణ్‌, తన మిత్రబృందంతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మనుక్రాంత్ గారు వారికి కండువా కప్పి సాదర ఆహ్వానం పలికారు. అనంతరం చెన్నారెడ్డి మనుక్రాంత్ మీడియాతో మాట్లాడుతూ.. యువత జనసేన పార్టీని ఆధరించడం సంతోషంగా ఉందన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు, కన్నీల్లే మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వ,తాతల పింఛన్లు, వితంతువుల పింఛన్లు, దివ్యాంగులు పించన్లను తొలగించడానికి జగన్‌కు మనసెలా ఓప్పిందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం పింఛన్లను దౌర్జన్యంగా తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు సీటీలోనే దాదాపు 6 వేల పింఛన్లను తొలగించి వారి కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పింఛన్లు తొలగించి నేతలు రాజకియాల్లో ఎలా ఉండగలుగుతున్నారని ప్రశ్నించారు. అంత మంది పింఛన్లను తొలగించి ఏ విధంగా గడపగడపకు వెళ్తున్నారని నిలదీశారు. అర్హులకు పింఛన్ ఇచ్చేంత వరకు జనసేన పార్టీ పోరాడుతూనే ఉంటుందని అవసరమైతే ఉద్యమాన్ని చేపడతామని చెన్నారెడ్డి మనుక్రాంత్ హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం రోజురోజుకు దిగజారి పోతుందని కలెక్టర్‌లను ప్రస్‌మీట్ పెట్టి తిట్టమనడం దేశ చరిత్రతో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తిడుతుంటే ప్రజలు అసహించుకుంటున్నారని అందుకే కలెక్టర్‌ల చేత తిట్టించే కార్యక్రమం మొదలు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలు వైసీపీ పాలను చూసి తిట్టుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు కష్టాలను పడుతుంటే బాధలను పట్టించుకోకుండా సిటీ ఎమ్మెల్యే కేవలం జగన్‌ను పొగడటానికి, భజనలు చేయడానికే సరిపోతుందని, గెలిపించిన ఓటర్లను ఆదుకోలేక పోయారని చెన్నారెడ్డి మనుక్రాంత్ అన్నారు. నగర అధ్యక్షుడు సుజయ్ బాబు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు తప్ప అభవృద్ది శూన్యం చేశారని సుజయ్ మండిపడ్డారు. పింఛన్లును రద్దుచేసి పేదలను ఇబ్బందిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలు ఎందుకు వేశామని అనుకుంటూ బాధపడుతున్నారని తెలిపారు. జగన్ తీరు మారకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. పింఛన్లు పెంచుతున్న కొద్ది అర్హులను తగ్గించడం ఏమిటని మండిపడ్డారు. జనసేన పార్టీలో భరిఎత్తున చేరికలు జరుగుతున్నాయని సుజయ్ బాబు తెలిపారు. ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. 27 డివిజన్ నుంచి పవన్ కళ్యాన్ పై అభిమానంతో యువత జనసేన పార్టీ చేరడం జరిగిందని ఉదయ్ తెలిపారు. నిజాయితీగా పేదలకు సాయం చేసేందుకు జనసేన పార్టీ పోరాడుతుందని తెలిపారు.. పవన్ కళ్యాన్ గెలుపుకోసం కృషి చేస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ తో పాటు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి కలువాయి సుధీర్, కృష్ణ -పెన్నా కమిటీ కో- కన్వీనర్ కోలా విజయలక్ష్మి , మహిళా నాయకురాలు సావిత్రి నగర డివిజన్ ఇన్చార్గులు రమణ , సుల్తాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.