పురపాలక సమావేశంలో జనసేన కౌన్సిలర్ తిక్కా సత్య లక్ష్మి

అమలాపురం: అమలాపురం పురపాలక సాధారణ సమావేశం శుక్రవారం చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన కౌన్సిలర్ తిక్కా సత్యలక్ష్మి పలు విషయాలపై ప్రశ్నించారు. పురపాలక స్కామ్ లు పై మూడు సంవత్సరాలుగా విని, విని చెవులు మూసుకుంటున్నాము. మంచి నీరు మురుగుగా వుంది అంటే సబ్బు పెట్టి కడుక్కోవాలి అంటారు. ఏమైనా అడిగితే మా మీద అరుస్తారు ఏమిటి ఈ సమావేశం అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. గృహ సారధులు ఎవరు వారికి 38వేలు జనరల్ ఫండ్ నుండి ఖర్చు చేయడం ఏమిటీ, వారు మున్సిపల్ ఉద్యోగులా.. అంటూ జనసేన కౌన్సిలర్. సత్య లక్ష్మీ ప్రశ్నించారు. కమిషనర్ వి ఐ పి నాయుడు అధికారుల తడబాటు వలన వాలంటీర్ల ట్రైనింగ్ జరిగితే పొరబాటున గృహ సారధులు అంటూ పడింది అంటూ తెలిపారు. కమిషనర్ చెప్పిన సమాధానంపై కౌన్సిలర్ సత్య లక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేసారు.
కలెక్టర్ ఇఫ్తార్ కు రెండు లక్షలు ఇస్తే షాదీఖానాలో జరిగిన కార్యక్రమంలో మరో 70 వేలు ఖర్చు చేశామని మున్సిపాలిటీ బిల్లులు పెట్టడం ఏమిటి అంటూ సత్యలక్ష్మి మరోసారి ప్రశ్నించారు.