చంద్రగూడెం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని జనసేన డిమాండ్

మైలవరం: మైలవరం స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ.. చంద్రగూడెం గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో గతంలో ఇచ్చిన కొండగట్టు ప్రాంత ఇళ్ల స్థలాలు నివాసయోగ్యం కానివి అని జనసేన అభ్యంతరం తెలపడంతో.. ఆ తర్వాత స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ వారు కూడా పరిశీలించి ఇవి నివాసయోగ్యంగా లేవని మరొకచోట గ్రామానికి సమీపంలో స్థలాలు ఇస్తామని చెప్పి పేపర్లో ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం అంతటా కూడా ఇండ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం పూర్తి అయినప్పటికీ.. చంద్రగూడెం గ్రామ పంచాయతీలో నేటికి కూడా స్థలాల పంపిణీ కార్యక్రమం జరగలేదని, 100 మందికి పైబడి లబ్ధిదారులకు లాటరీ ద్వారా మైలవరంలోని పూరగుట్ట ప్రాంతంలో స్థలాన్ని ఇచ్చినట్లుగా, పుస్తకం కూడా పంపిణీ చేశారని, నేటికీ అక్కడ ఇళ్ల స్థలాలను ఇదే లబ్ధిదారులకు ఇస్తున్నారా లేదా ఆ స్థలాలను వేరొకరికి ఇచ్చారా అనేది అధికారులకు కూడా తెలియని పరిస్థితి ఉందని, గ్రామ సచివాలయ అధికారులు అడగగా ఊరికి దగ్గరలో కొనుగోలు చేసి అందరికీ ఇక్కడే స్థలాన్ని పంపిణీ చేస్తారు అన్నట్లుగా చెబుతున్నారని, ఈ ప్రక్రియ కూడా ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి అని.. జనసేన పార్టీ తరఫున మేము వెంటనే గ్రామంలో స్థలాన్ని కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. పేదలు అయిన వారికి సొంతింటి కల కలగానే మిగిలి పోయే పరిస్థితి చంద్ర గూడెంలో ఉన్నదని వాపోయారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రమేష్ బాబాయ్, మల్లారపు దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.