జనసేన ఐ.టి. విభాగం జిల్లా కో ఆర్డినేటర్ల నియామకం

జనసేన పార్టీ ఐ.టి. విభాగం జిల్లా కో ఆర్డినేటర్ల నియామకానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. జిల్లాలో జరిగే పార్టీ సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన ఐ.టి. సేవలను ఈ కో ఆర్డినేటర్లు సమన్వయం చేస్తారు. ఈ విభాగానికి ఛైర్మన్ గా మిరియాల శ్రీనివాస్ ని ఇప్పటికే నియమించిన సంగతి తెలిసిందే. జిల్లా కో ఆర్డినేటర్లుగా …

గాలిదేవర తామేష్ : తూర్పుగోదావరి
వసంతాల శ్రీనివాస్ : పశ్చిమగోదావరి
నెరుసు వివేక్ : కృష్ణా జిల్లా
ముత్తిరెడ్డి రవికృష్ణ : గుంటూరు
పెళ్లూరి వీరాంజనేయులు : ప్రకాశం
నక్కల శివకృష్ణ : నెల్లూరు
సల్లా గవాస్కర్ : చిత్తూరు
యాపర్ల వెంకటేష్ : కడప
ఎస్.లక్ష్మీకాంత్ రెడ్డి : కర్నూలు
పాసల శ్యామ్ సుందర్ : అనంతపురం