నెల్లూరు నగరంలో పర్యటించిన జనసేన నాయకులు

నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేట, బాలాజీ నగర్, ఏసీ స్థూపం, రామ్ నగర పరిసర ప్రాంతాల్లోని నెల్లూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అద్వర్యంలో నెల్లూరు జిల్లా మరియు నగర నాయకులతో కలిసి స్థానికంగా ప్రధాన సమస్యలుగా మారిన పారిశుధ్య సమస్యలపై పర్యటించారు. ఈ సందర్బంగా నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ ఆదివారం నెల్లూరు నగరంలో బాలాజీ నగర్, ఏసీ నగర్, స్టానోస్ పేట ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అంటూ ప్రజల దగ్గర నుండి కోట్లు వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వం దానికి అనుగుణంగా పనులు మాత్రం చేయట్లేదు. ఎక్కడ చూసినా మురుగు చేరుకుంటోంది తద్వారా ప్రజలు విషజ్వరాలు పాలవుతున్నారు. శాసనసభ్యులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బల ప్రదర్శనలు, కార్తీక దీపోత్సవాలు చేసుకుంటున్నారు. మొన్న కురిసిన వర్షాలకు వచ్చిన జ్వరాల వల్ల పేషెంట్లతో ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం నిండిపోయింది. ఇకనైనా మేల్కొని కనీసం రోడ్ల పక్కన ఉన్న డ్రైనేజీల్లో పూడిక తీసి మురుగు లేకుండా చూడాలి. మునిసిపల్ కమీషనర్ కి కూడా జనసేన పార్టీ తరపున ఫిర్యాదు చేయబోతున్నాం. కదలిక లేకపోతే జనసేన పార్టీ శ్రమదానం చేసి అయినా నెల్లూరు నగరాన్ని పరిరక్షించుకుంటాం అని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నగర అధ్యక్షులు ఆధ్వర్యంలో నగరంలోని పరిసర ప్రాంతాలను పర్యటించామని చెత్తబుట్టల పాయింట్స్ అవసరం లేదు ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ అని చెప్పి రోడ్ల మీద ఉన్న చెత్త మరియు కాలవ పూడికలు తీయటంలేదని, దీని వల్ల స్థానికులు దుర్గంధం మరియు దోమలతో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే జనసేన తరుపున ఆందోళను ఉదృతం చేస్తాం అని అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి కరంపూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వాలంటరీల ద్వారా చెత్త పన్నుని బెదిరించి మరి వసూలు చేస్తున్నారే కానీ నగరంలో పారిశుధ్య విషయంలో మటుకు నగర ఎమ్మెల్యే నుంచి మున్సిపల్ అధికారులు వరకు ఎవరు పాటించుకోవటం లేదు అని ప్రశ్నించిన ప్రతిపక్షాల మీద కేసులు పెట్టటం తప్ప అభివృద్ధి అనేది లేదని అన్నారు. జిల్లా కార్యదర్శి షేక్ అలియా మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని పారిశుధ్య లోపం వల్ల ప్రజలు తీవ్ర ఇబందులు పడుతున్నారని అది గాలికి వదిలేసి ప్రతిపక్షాలకి పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటన మీద మాత్రమే మాట్లాడుతున్నారని ముఖ్యంగా రోజా అయితే మతి భ్రమించి మాట్లాడుతున్నారని కూల్చడాలు, పడగొట్టడాలు మీద ఉన్న శ్రద్ధ మిమల్ని గెలిపించిన ప్రజల ఆరోగ్యం మీద కూడా చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమం నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో పటు రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి షేక్ అలియా, నగర కార్యదర్శిలు పతి రాము, దాసరి మాధురి, కొల్లు కళ్యాణ్, రమేష్ రాజు, షేక్ సాయిబాబా నగర డివిజన్ ఇంచార్జిలు దాసరి రమణ, శనివారపు అజయ్, వినయ్ కుమార్, పృద్వి అలేఖ్, అక్కిశెట్టి శ్రీధర్, కొలిపాక ప్రసాద్ జనసేన నాయకులు సుబ్బు, చిన్ని పృధ్వి తదితరులు పాల్గొన్నారు.