ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 13వరోజు పాదయాత్ర

ఏలూరు, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 13వ రోజు పాదయాత్రలో భాగంగా ఏలూరులోని స్థానిక 30వ డివిజన్ లో వినయ్ కార్తిక్, సుధాకర్ ఆధ్వర్యంలో డి-మార్ట్ వద్ద నుండి మంచినీళ్ళతోట, మోతేవారి తోట మీదుగా అశోక్ నగర్ బ్రిడ్జి వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ స్థానిక డివిజన్ లో అనేక సమస్యలు ఉన్న పట్టించుకోని ప్రజాప్రతినిధులను నిలదీసే దిశగా ప్రజలు ఉండాలని మన హక్కులను కాలరాసే విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఇకనైనా సమస్యలపై దృష్టి సారించాలని లేని పక్షాన ఏలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి డివిజన్ లోని సమస్యలు అన్నింటినీ ఒక నివేదిక తయారు చేసి పవన్ కళ్యాణ్ కి అందజేస్తామని రెడ్డి అప్పల నాయుడు హెచ్చరించారు. ఇప్పటికే మా అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి జనవాణి అనే కార్యక్రమాన్ని స్వయంగా ప్రజల నుండి వినతులు స్వీకరించి జూలై 3 వ తేదీ నుండి 5 ఆదివారాల పాటు రాష్ట్రంలో నలుమూలల సమస్యల వినతిపత్రాలు స్వయంగా స్వీకరించనున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టి బుధ్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రెడ్డి అప్పల నాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, స్థానిక నాయకులు తారకేష్, పవన్ కుమార్, లక్ష్మణరావు, విజయ్ కుమార్, శ్రీమన్, బాబురావు, మహేష్, శివ మరియు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.