పూడికలు తొలగించాలి: రెడ్డి అప్పల నాయుడు

  • ఏలూరు నియోజకవర్గంలో 18 వ డివిజన్ లో ఉన్న పంట కాలువ పూర్తిగా మురికితో వ్యర్ధాలతో నిండిపోయింది. ఆ కాలువ లో ఉన్న చెత్తను, వ్యర్థాలను ,పూడికను తొలగించండి ..
  • మీరు తీయించని పక్షంలో ఈనెల 21 వ తేదీ నుండి మా జనసేన పార్టీ తరపున మేమే తీయించుకుంటాం..
  • హెచ్చరించిన రెడ్డి అప్పల నాయుడు..

ఏలూరు నియోజకవర్గంలో 18వ డివిజన్ లో ఉన్న పంట కాలువ పూర్తిగా మురికితో వ్యర్ధాలతో నిండిపోయింది. ఆ కాలువలో ఉన్న చెత్తను, వ్యర్థాలను, పూడికను తొలగించండి.. మీరు తీయించని పక్షంలో ఫిబ్రవరి 21వ తేదీ నుండి మా జనసేన పార్టీ తరపున మేమే తీయించుకుంటాం.. అని రెడ్డి అప్పల నాయుడు హెచ్చరించారు .. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని గారికి, మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి 18వ డివిజన్లో ఉన్న డ్రైనేజీ విషయాన్ని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఏమనగా మేము ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా 18వ డివిజన్లో పాదయాత్రకు వెళ్లినప్పుడు కృష్ణ కెనాల్ నుంచి బాప్టిస్ట్ పేటకు వెళ్ళె పంట కాలువ పూర్తిగా చెత్తతో నిండిపోయింది. ఆ పంట కాలువను డ్రెయిన్ గా మార్చి వేశారు. ఆ కాలువ పూర్తిగా మురికితో వ్యర్ధాలతో నిండి దుర్వాసన వెదజల్లి స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. 18వ డివిజన్ లోని వంగాయిగూడెం, సుబ్రహ్మణ్యం కాలనీ, గొల్లాయగూడెం, బిట్ నెంబర్ 1, ఆముదాల అప్పలస్వామి కాలనీ లో ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.. తక్షణమే మున్సిపల్ అధికారులు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తూనే ఉన్నారని అక్కడ ఉండే ప్రజల సమస్యలు ఎంత ఘోరంగా తయారైందో. ఇది సరైన పద్ధతి కాదు. తక్షణమే దానిమీద చర్యలు తీసుకోవాల్సిందిగా, పూడిక తీయించి, మంచి వాతావరణాన్ని, ఏర్పాటు చేయాలని ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.నేను పాదయాత్రకి వెళ్లినప్పుడు ఈ సమస్యల్ని మా దృష్టికి తీసుకువచ్చి అనేకమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొల్లాయగూడెంలో ఉన్నటువంటి మంచినీటి బావి కూడా పూర్తిగా చెత్త, వ్యర్థాలతో నిండిపోయింది. నీరు మొత్తం కలుషితం అయింది. ఇదివరకు ఏదైనా పంపు రిపేర్ వచ్చినప్పుడు ఈ నీటిని ఉపయోగించేవారు. ప్రస్తుతం పట్టించుకునే నాధుడు లేడని కనుక తక్షణమే మీరు ఈ సమస్యలను పరిష్కరించాలని, చేయని పక్షంలో మేము జనసేన పార్టీ తరఫున ఈ నెల 21వ తేదీ తరువాత ఆ కార్యక్రమాన్ని చేస్తామని మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించాల్సిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని శత్రువులుగా మేము గుర్తించట్లేదు. కేవలం మీ బాధ్యత మాత్రమే తెలియజేస్తున్నాం. మీరు గౌరవ వేతనాలు తీసుకుంటున్నారు. మీ సిబ్బంది జీతాలు తీసుకుంటున్నారు. ఈనెల 20 వ తేదీ వరకు చూస్తాం. మీరు చేయని పక్షంలో 21 వ తేదీ నుండి ఈ కార్యక్రమాన్ని మేమే జనసేన పార్టీ తరపున మొదలుపెడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, నాయకులు బోండా రాము నాయుడు, నిమ్మల శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.