మన ఊరిలో జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామంలో పార్టీ బలోపేతం మరియు ప్రజా సమస్యల పోరాటానికై మన ఊరిలో జనవాణి కార్యక్రమాన్ని జనసేన నాయకురాలు లోకం మాధవి ప్రారంభించారు. గడప గడపకు పర్యటించిన మాధవి చింతపల్లి గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుత ప్రభుత్వం వారికి చేసిన అన్యాయం పై తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. మృత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, రోజు కూలి చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న వారి బాధలు వర్ణనాతీతం.ఆ ప్రాంతం లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడి లానే తయారయ్యింది. గ్రామం లోని పారిశుధ్యం ఏ మాత్రం పరిశుభ్రముగా లేదు. ఇప్పటికీ తాగినీటి సమస్య ఊరిని వెంటాడుతూనే ఉంది. 40 ఏళ్లనుండి ఎన్నిప్రభుత్వాలు వస్తున్నా తమ ప్రాంతం అభివృద్ధి ఏ మాత్రం ముందుకు పోలేదు అని గ్రామస్తులు వాపోయారు. వైస్సార్సీపీ ప్రెసిడెంట్లు, వార్డ్ మెంబర్లు తమకి నిధులు విడుదల అవ్వట్లేదు అని మొరపెట్టుకున్నారు. చింతపల్లి జట్టి నిర్మాణం చేపట్టాలని, లేకపోతే ఈవలసలు ఇలానే కొనసాగుతూ ఉంటాయని మృత్స్యకార కుటుంబాలు ఆవేదన చెందాయి. చింతపల్లికి చెందిన 25 కుటుంబాల ఇళ్ళు దగ్ధం అయి 4 ఏళ్లు గడుస్తున్నా ఈ రోజుకీ వారికి నిధులు మంజూరు అవ్వకపోవడం ఈ ప్రభుత్వ నియంత పాలనకి అద్దం పడుతుంది అని లోకం మాధవి ధ్వజమెత్తారు. మానస ట్రస్ట్ కి సంబంధించిన భూమి పై తమ నివాసాల్ని ఖాళీ చేయమంటున్నారు అని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తమ ఇళ్ల కూల్చివేతకి అధికారులు యత్నించారు అని అక్కడ నివసిస్తున్న వారు తెలియజేసారు. సమస్యలు ఆన్ని క్షుణ్ణంగా విన్న మాధవి బాధితుల తరపున తమ పోరాటం చేస్తాం అని భరోసా కల్పించారు.