త్రాగు నీరు కలుషితం కాకుండా పలు చర్యలు చేపట్టిన మేడిది సరోజ

కేశవదాసుపాలెం గ్రామంలో ఓ.ఎన్.జి.సీ వారి సహకారంతో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంకులకు గత కొంత కాలంగా వాటిని శుబ్రపరిచేందుకు పైకి ఎక్కడానికి నిచ్చెన, ట్యాంక్ కు మూతలు లేకపోవడంతో త్రాగు నీరు కలుషితం అవుతున్న కారణంగా గ్రామ సర్పంచ్ మేడిది సరోజ వాటికి అవసరం అయిన ఇనుప నిచ్చెనలు, టాంక్ పై మూతలు పంచాయితీ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉండపల్లి సాయి కుమార్ అంజి, ఎన్.జి.అర్.ఎస్ చింతా రామలక్ష్మీ, కొల్లబత్తుల బన్ను, రవి, పాలపర్తి చంద్రరావు, చింతా రాజబాబు, గెడ్డం సుజాత, నాని, పంచాయితి సిబ్బంది పాల్గొన్నారు.