జన సైనికుడి ఇంట భోజనం చేసిన నాదెండ్ల

సామాన్య కార్యకర్తను సైతం తమ కుటుంబ సభ్యుడిగా చూసుకొనే సంస్కృతి జనసేన పార్టీలో ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో జరగనున్న పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా సిద్ధవటం గ్రామంలో చేపట్టే కౌలు రైతు భరోసా యాత్ర ఏర్పాట్లను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంలో సిద్ధవటం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త ఆవుల నాగరాజ తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా కోరారు. ఆ మేరకు నాదెండ్ల మనోహర్ శుక్రవారం మధ్యాహ్నం నాగరాజ ఇంటికి భోజనానికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కొంత సేపు సంభాషించారు. పార్టీ కోసం ఆ జన సైనికుడు పడుతున్న తపనను మెచ్చుకున్నారు.
* చేనేత రంగానికి అండగా…
జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం గ్రామానికి చెందిన చేనేత కార్మికులు కలిశారు. నేతన్న నేస్తం పథకంలో చోటు చేసుకున్న అవకతవకల్నీ, గిట్టుబాటు దక్కక తాము పడుతున్న ఇబ్బందుల్ని ఈ సందర్భంగా వారు శ్రీ మనోహర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. చేనేత సమస్యలను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తానని, ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని వారికి హామీ ఇచ్చారు. చేనేత రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా నిలుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా చేనేత కార్మికులు మనోహర్ గారిని నూలుతో సత్కరించి, నేత చీరను బహూకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నేతలు తాతంశెట్టి నాగేంద్ర, ముకరం చాంద్, పెండ్యాల హరి, ఎమ్.వి.రావు, రాటాల రామయ్య, కత్తి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *