Mylavaram: కాలుష్య కోరల్లో మైలవరం నియోజకవర్గం

కాలుష్యం కోరల్లో మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, కొండపల్లి చుట్టుపక్కల గ్రామాలు కర్మాగారాల వలన అనేక మందికి ఉపాధి కలుగుతుంది, అదే ప్రాతపదికన ప్రజలకు నష్టంకూడా అంతకుమించి పెద్దఎత్తున జరుగుతుంది. నిత్యం థర్మల్ పవర్ స్టేషన్ నుండి వెలువడే వ్యర్థాల వలన గాలి, నీరు కాలుష్యంతో అనేక వ్యాదులు, త్రాగునీరు కలుషితం వంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. థర్మల్ పవర్ స్టేషన్ పరిధికి చెందే గ్రామాలకు స్వచ్చమైన త్రాగునీటిని అందించే బాద్యతను యాజమాన్యం స్వీకరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిత్యం బూడిదతో వెళ్ళే వాహనాల వలన బూడిద గాలుల్లోకి లేవడం వాహనదారుల కళ్ళలో పడడం వలన వాహనదారులు అనేక ఇబ్బందులకు, ప్రమాదాలకు గురి అవుతున్నారు. నీటికాలుష్యంతో త్రాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది, యాజమాన్యం ప్రజల ఆరోగ్యం దృష్టిలోకి తీసుకుని కాలుష్యనియంత్రణపై దృష్టి సారించగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. మీ పరిధిలో గ్రామాలలో నిర్వహించవలసిన మెడికల్ క్యాంపుల దాఖలాలు అయితే ఎక్కడా కనిపించడమే లేదు. మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణడిస్ట్రిక్ట్ సెక్రటరీ లక్ష్మి కుమారి చింతల మరియు జనసైనికులు పాల్గొన్నారు.