నిజం గెలవాలిలో పాల్గొన్న పత్తి చంద్రశేఖర్

  • నారా భువనేశ్వరి తో మాటమంతి

పుట్టపర్తి: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులు తట్టుకోలేక పుట్టపర్తి మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన మునిమడుగు బావయ్య మృతి చెందారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మృతుని కుటుంబానికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ ఆమె వెంట ఉన్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గం గురించి కాసేపు నారా భువనేశ్వరి తో పత్తి చంద్రశేఖర్ చర్చించారు.