రాజకీయాల్లో మార్పు కోసం ఉప్పెనలా వస్తున్న జనసేనాని

ఆలోచన లేని ఆవేశం గుడ్డిది.. ఆవేశం లేని ఆలోచన కుంటిది.. ఎంత లోతైన ఆలోచనలున్నా, కాస్తంత ఆవేశం లేకపోతే అవేవీ కార్యరూపం దాల్చవు.. ఆ ఆవేశం ప్రసంగాలు వినడం ద్వారానే ఎక్కువగా లాభం చేకూరుస్తాయి.. ఏ సామాజిక సందర్భంలోనైనా జనం నిశ్శచేష్టంగా, స్తబ్దంగా పడిఉన్నప్పుడు వారిని కదిలించడానికి, ఉద్వేగపరచడానికి శక్తివంతమైన ఉపన్యాసాలు అవసరం అవుతుంటాయి.. స్వాతంత్రోద్యమ కాలంలో అనేకమంది జాతీయ నాయకులు చేసిన ప్రసంగాలు నాడు ఉప్పెనలా దూసుకుపోయేలా చేశాయి.. ఉపన్యాసాలకు ఉన్న శక్తి అంతటిది.. ఒక ఆలోచనకు ఆవేశం తోడైనప్పుడు మరింత శక్తిమంతంగా మారుతుంది. ఎంతోమంది నాయకులను, పార్టీ లను చూసాము.. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ వీరందరికి ఓటువేసి అవకాశం ఇచ్చాము.. కానీ ఎవరూ ప్రజలకు ఏమీ చేసింది లేదు.. అవకాశవాదులే, అవినీతిపరులు, నేరచరిత్ర ఉన్నవారే.. సామాన్యుల గురించి మాటలు చెప్పేవారే కానీ అవకాశం ఇస్తే చేతలలో మాత్రం శూన్యం..

పవన్ కళ్యాణ్ గారిని దశాబ్దం పైగా చూస్తున్నాము.. ఆయన వ్యక్తిత్వం సమస్యల పట్ల స్పందించే తీరు, ఆయనలోని మానవత్వం మనకి తెలుసు.. నమ్మకం కుదిరింది.. చంద్రబాబు గారిలో ఒక మోసగాడు కనపడ్డాడు.. కాంగ్రేస్, జగన్ లో అవినీతి, రక్తచరిత్ర ఉంది.. ఇక బీజేపీ. ఇటువంటి పరిస్థితుల్లో సమాజం గురించి ఆలోచించే జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానం, సమస్యలకు ఆయన స్పందించే తీరు ఇప్పటి రాజకీయాలకు .. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు విన్న, ఆయన సమావేశాలకు వెళ్లిన, ఆయన మాటలు విన్న.. ఆయనకు సమాజం పట్ల ఉన్న బాధ్యత మనకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆయన ప్రసంగాలలో సమాజంపై తనకు ఉన్న బాధ్యతను చెప్తారు కానీ ఎప్పుడూ ఆయన స్వంత విషయాలు చర్చించటం కానీ ఆయన ఇంతకముందు చేసిన చెప్పటం కానీ చెయ్యరు. మహిళలు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. భారత ప్రధాన మంత్రిగా ఇందిరా గాంధీ, పాకిస్థాన్ ప్రధానిగా బెనజీర్ భుట్టో, శ్రీలంక ప్రధానిగా సిరిమావో బండారు నాయకేలు.. ఆ పదవుల్లో పని చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని మహిళలు రాజకీయ రంగంలో ఉన్నతస్థానాలకు ఎదగాలి.

ఇంకొక విషయం ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడాల్సింది మీడియా.. ఏ ఒక్క తెలుగు మీడియా ఛానల్ కూడా పవన్ కళ్యాణ్ మీటింగులు కానీ,
సమావేశాలు కానీ టెలికాస్ట్ చేయవు. తెలుగు న్యూస్ చానల్స్ దాదాపు అన్నీ అధికార పార్టీ, కులానికి ప్రలోభపడి పవన్ కళ్యాణ్ గారి, జనసేన వార్తలు చూపించరు.. అదే అయన్నీ విమర్శించే పనికిమాలిన రాంగోపాల్ వర్మ, కత్తి మహేష్, శ్రీరెడ్డి ల డిబేట్స్ గంటలు గంటలు చూపిస్తారు.. సమాజంలో మార్పు, రాజకీయ జవాబుదారీతనం, ప్రశ్నించే నైజం యువతలో తీసుకువచ్చే ప్రయత్నాన్ని జనసేనాని చేస్తుంటే చూపించరు, రాయరు.. ఎక్కడ ఆయనకు మద్దతు పెరిగిపోతుందో ననే భయంతో ఈ ధృతరాష్ట్రుడు లాంటి ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియావాళ్ళు. ఏదో ఒక రోజు మనకు వస్తుంది అని చిన్న ఆశ తోటే, రాజకీయాలు రాజకీయ జీవితం అంత పెట్టాల్సి ఉంటుంది. విజయం అనేది ఎప్పుడో ఒక రోజు వస్తుంది కానీ అది ఎప్పుడనేది ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ కు గెలుపు అనేది తప్పకుండా వస్తుంది కాకపోతే దాని రోజు మాత్రం మారుతుంది అంతే. పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం, అయిన వాళ్ళును వదులుకున్న రోజులు ఉన్నాయి, సొంత స్నేహితులు లో చాలామంది ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. క్షణం తీరిక లేకుండా అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు జనసేనాని. ఒకసారి ఆయనకు కూడా అవకాశం ఇచ్చి చూడటంలో తప్పులేదు.. ఒక పౌరుడిగా సామాజిక బాధ్యతగా మార్పు కోరుకొనే వారిగా మనవంతు బాధ్యత నిర్వహిద్దాం.