Gajuwaka: పార్టీ పెట్టిందే ప్రశ్నించేందుకు

పార్టీ పెట్టిందే ప్రశ్నించేందుకు. ఆయన ఏ రోజు అధికారాలు కోరుకోలేదు. కుర్చీలు కావాలి అనుకోలేదు. పూల దండలు.. దొంగ నమస్కారాల మధ్య పాలన చేద్దాం అనుకోలేదు.. పరిపాలించే వాళ్లు నిజాయితీగా ఉండాలని సమాజ శ్రేయస్సు కోరాలని అలా చేయక పోతే ప్రశ్నించాలని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యలు ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వస్తున్నారు సన్నిహితులైన భాజపాను కూడా. అతనెప్పుడూ ప్రజల మనిషి ప్రజల పక్షపాతి . రాలేదు రాలేదు అంటే ప్రారంభోత్సవాలకు… సన్మానాలు సత్కారాలకు.. భజన పరుల భజన వినడానికి ఆయన రారు. వేలాది మంది ఉక్కు కార్మికులు సమస్యలో ఉన్నారు అని తెలిసి వస్తున్నారు.. ఎప్పుడైనా నాయకుడనేవాడు ప్రజల కోసం అలానే వస్తాడు అంతే కానీ ఓట్లు వేయండి అని యాచించేoదుకు ఆయన రారని, కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ హాజరయ్యే సభకు అధిక సంఖ్యలో జనసేన నాయకులు, వీరమహిళలు, శ్రేయోభిలాషులు, ఉద్యోగులు మరియు జనసైనికులు హాజరవ్వాలని 85వ వార్డు అగనంపూడి జనసేన నాయకులు దాసరి త్రినాధ రావు పిలుపునిచ్చారు.