పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పసుపు నీళ్లతో అభిషేకం

  • పవన్ కళ్యాణ్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు

మదనపల్లె: పవన్ కళ్యాణ్ గారు ప్రతి వ్యవస్థ లోను, ప్రతి సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుందని వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగిందని, 100 పండ్లలో ఒక పండు చెడిపోతే మిగతా పండ్లు కూడా చెడిపోతాయి కాబట్టి వాలంటీర్ లలో ఉన్న కొంతమంది చెడుని ఎత్తి చూపే ప్రయత్నం చేసారని జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు ఏ అభాండంలేని వ్వక్తి, ఏ కేసులు లేవు కాబట్టి ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సి.పి.ఎస్ రద్దు గురించి అడిగితే మూడు పెళ్లిళ్లు, రాజధాని గురించి అడిగితే మూడు పెళ్లిళ్లు, జాబ్ క్యాలెండరు గురించి అడిగితే మూడు పెళ్లిళ్లు, పోలవరం గురించి అడిగితే మూడు పెళ్లిళ్లు, మద్యపానం నిషేధం గురించి అడిగితే మూడు పెళ్లిళ్లు మాట్లాడుతారు ఈ వగ లేని ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ గుండాలని, వైసీపీ ముకలను పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతి ఘటన జరుగుతుంది. దాన్ని మేము నిరసిస్తూ పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటానికి పసుపు నీళ్లతో అభిషేకం చేయడం జరిగింది అన్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని, పాజిటివ్ గా తీసుకోవాలని వాలంటీర్ సోదరి సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకులు జగదీష్, మదనపల్లి రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, సనా ఉల్లా, గడ్డం లక్ష్మిపతి, నవాజ్, రెడ్డెమ్మ, నాగవేణి, రేణుక, శంకర కుమార్ తదితరులు పాల్గొన్నారు.