రంజాన్ ఉపవాస దీక్షలు పవిత్రం
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఇస్లాం మతం పాటించే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. నెల రోజులపాటు నియమనిష్టలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు అల్లా దీవెనలు లభించాలని కోరుకుంటున్నానని జనసేనాని తెలిపారు.