విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన కార్యాలయంలో రంగా వర్ధంతి వేడుకలు

విజయవాడ తూర్పు నియోజకవర్గం; స్వర్గీయ వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించి ఘననివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, నగర కమిటీ సభ్యులు, ధార్మిక కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.