సర్వేపల్లి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ 1950 జనవరి 26 భారత రాజ్యాంగాన్ని అమలులోకి రావడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలపాటు సుదీర్ఘంగా తన మేధాశక్తితో మన హక్కులని మన విధులని అందులో పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగం నిర్మాణం జరిగే నేటికీ 74 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈనాడు దేశవ్యాప్తంగా కూడా కుల, మత వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా జనవరి 26 రిపబ్లిక్ డేని ఒక పండుగ రోజులా జరుపుకోవడం అదేవిధంగా ఈరోజు సర్వేపల్లి గ్రామంలో ఉన్న నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు జాతీయ జెండాను వేగరవేయడం జరిగింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు కావాలి. పేద, బడుగు బలహీన వర్గాలకే న్యాయం జరగాలి. సామాన్యులకి ప్రభుత్వ కార్యాలయాలలో పూర్తిస్థాయిలో పనులు జరగాలంటే ఒక జనసేనతోనే సాధ్యం. అంబేద్కర్ గారి ఆశయాలు సాధించాలంటే వారి ఆశయం నెరవేరాలంటే ఒక మా అధినేత పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ రహీం, పిన్నిశెట్టి మల్లికార్జున్, సుధాకర్, వెంకయ్య, సుబ్రహ్మణ్యం, శ్రీహరి, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.