ప్రపంచంలో రెండవ బ్రాండ్ స్థానం: రిలయన్స్

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవల కాలంలో కార్పొరేట్ ప్రపంచంలో వరుస విజయాలు సాధిస్తున్నారు. తాజాగా మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచంలో రెండో అతి పెద్ద బ్రాండుగా రిలయన్స్ నిలిచింది. ప్రస్తుత సంవత్సరంలో ఫ్యూచర్ బ్రాండు రూపొంచిందిన సూచీలో యాపిల్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకోగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఈ ఇండెక్స్ లో మూడో స్థానంలో శామ్ సంగ్ నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఎన్ విడియూ.. మౌటాయ్.. నైక్.. మైక్రోసాఫ్ట్.. ఎఎస్ఎమ్ ఎల్.. పేపాల్.. నెట్ ఫ్లిక్స్ లుచోటు సంపాదించాయి. తాజాగా విడుదల చేసిన ఇండెక్స్ లో టాప్ 20 బ్రాండుల్లో ఈసారి కొత్తగా అడుగు పెట్టినవి ఏడు కాగా.. అందులో రిలయన్స్ ఏకంగా రెండో స్థానాన్ని సొంతం చేసుకోవటం విశేషం.