చంద్రమోహన్ మారుతీ నష్టపరిహారం ఇవ్వాలి?: జనసేన మురళి

  • రోడ్డు సౌకర్యం లేక గిరిజనుడు మృతి దీనికి కారకులైన ఎమ్మెల్సీ కుంభ రవిబాబు ఆయన అనుచరుడు చంద్రమోహన్ మారుతీ నష్ట పరిహారం ఇవ్వాలి: జనసేన మురళి

అరకు: అనంతగిరి మండలం, గుమ్మకోట పంచాయతీ మేటువలస గ్రామ కాపురస్తుడు చిన్న రామన్న అనే వ్యక్తికి సరైన వైద్యం అందక హాస్పిటల్ కి తీసుకెళ్తామన్న సరైన రోడ్డు సౌకర్యం లేక మరణించడం జరిగింది. అలాగే గుమ్మకోట నుండి శంకుపర్తి మీదుగా ఆరు కోట్ల 70 లక్షలు రోడ్డు మంజులైనప్పటికీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు తన భూదందను బయటకు పడుతదని, అప్పుడు ఎస్టి కమిషన్ చైర్మన్ గా ఉంటూ ప్రస్తుత ఎమ్మెల్సీ పదవిలో ఉంటు గిరిజన ప్రాంతంలో ఉన్న భూములు దోచుకోవడం తప్ప గిరిజనులకు ఎటువంటి మేలు చేయలేదు. ఆయన కేవలం మైనింగ్ లను భూములను కాపాడుకోవడం కోసమే అధికార పార్టీలో ఉండి పదవి దక్కించుకోవడం తప్ప మరి వేరేది లేదని జనసేన మురళి వ్యక్తం చేశారు. ఆయనకు నిజంగా గిరిజనులు మీద ప్రేమ ఉంటే ఆయన అనుచరుడైన చంద్రమోహన్ మారుతితో రోడ్డు పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాడు ఈ రోడ్డు మంజూరై సుమారు ఐదు సంవత్సరాలు దాటుతున్నా గిరిజనులకు డోలు మోత తప్పట్లేదు. శంకుపర్తి, మేట్టవలస, బూరుగువలస గ్రామస్తులకు చావు తప్పట్లేదు ఈ గిరిజన కుటుంబలు చావుకి ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మరియు ఆయన అనుచరుడు చంద్రమోహన్ మారుతి నష్టపరిహారం ఇవ్వాలి? రోడ్డుని సంబంధిత మండల అధికారులు కూడా స్పందించాలి? ఇప్పటికి రెండుసార్లు స్పందనలో ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేకపోవడం లేదు దీన్ని బట్టి చూస్తే రవిబాబు అనే వ్యక్తి ఎంత మాఫియాని నడిపిస్తున్నాడో అర్థమవుతుంది మా గ్రామంలో రోడ్డు సౌకర్యం భూములపై చెప్పినప్పటికీ మండల తాసిల్దార్ గాని అలాగే పోలీస్ అధికారులు చూసి చూడనట్లు ఉండడం బట్టే చిన్న రామన్న చావుకి కారణమైంది దీనిపై బాధ్యులైన ప్రతి అధికారిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా కుంభ రవిబాబుని సహకరిస్తున్న అధికారులపై వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి తగిన చర్య తీసుకోవాలని జనసేన పార్టీ సిహెచ్ మురళి పాల్గొన్నారు. ఇకపై ఇలాంటి మరణం అక్కడ ఏదైనా జరిగితే తప్పకుండా సంబంధిత ఆఫీస్ ముందుకు తీసుకొస్తామని మురళి తెలపారు. లేదంటే జనసేన పార్టీ నుండి గ్రామస్తులు తరఫున ప్రజా పోరడానికి సిద్ధంగా ఉన్నామని జనసేన మురళి అన్నారు. అలాగే గ్రామంలో ఇలాంటి అనారోగ్యంతో చాలా మంది గ్రామస్తులు ఇబందులకు గురి అవుతున్నారు. ఈ విషయంపై శంకుపర్తి మెట్టువలస బూర్జవలస గ్రామాలలో రోడ్డు సౌకర్యం కల్పించి గ్రామాలలో మెడికల్ క్యాంప్ నిర్వహించి మెరుగైన వైద్యం అందించే మండల వైద్య అధికారులకు ప్రజా ప్రతినిధులను జనసేన మురళి కోరారు. ఈ కార్యక్రమంలో కోట్టపర్తి శ్రీరామ్, సుర్ర బాబురావు, మాధుల శ్రీరామ్, సుర్రబోయిన సింహాచలం పాల్గొన్నారు.