ఏదో ఒక జిల్లాకి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలి: వాసగిరి మణికంఠ

గుంతకల్ పట్టణం బలిజ సంఘీయుల ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు పాల్గొన్న వాసగిరి మణికంఠ మాట్లాడుతూ… ప్రపంచ చరిత్రలో వజ్రవైడూర్యాలను నడిబజార్లో పోసి వ్యాపారం చేయించిన మహారాజు, ప్రజలను కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్న ఏకైక రాజు, ఆయన రాజ్యపాలన రాముడి పాలనలా మరిపించిన ఆంధ్రభోజుడు, కవిసార్వభౌముడు అయినటువంటి కృష్ణదేవరాయలవారి చరిత్రనూ ఈ కాలం నాటి పాలకులు విస్మరిస్తున్న తీరును అవమానంగా భావిస్తూ. సుమారు ఆయన పరిపాలన కొనసాగించి 500 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆయన హయాంలో అభివృద్ధి చేసిన అనేక నీటి కుంటలు, చెరువులు మరియు దేవాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం ఆయన గొప్ప పరిపాలన దార్శనికతకు నిదర్శనం అలాంటి మహారాజు జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి, అలాగే ఆయన పేరును ఏదో ఒక జిల్లాకు పెడుతూ భావితరాలకు ఆయన చరిత్రను తెలియజేసే విధంగా పాఠ్యాంశాల్లో చేర్చాలి అని ప్రధానంగా డిమాండ్ చేస్తూ మరీ ముఖ్యంగా 30% ఓటు బ్యాంకు కలిగిన బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూడకుండా, రాజకీయంగా చట్టసభల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలి, అలాగే అనేక సంవత్సరాలుగా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నా మాకు రిజర్వేషన్ కల్పించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో అందరమూ సంఘటితమై అన్ని కులాలను మతాలను కలుపుకుంటూ అధికారాన్ని సాధించి ఈ పాలకులకు తగిన శాస్తి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.