వైసిపి పాలి కాపులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా మీడియాతో మాట్లాడుతూ కాపులను ఉద్ధరిస్తానంటూ వైసిపి పాలు కాపులు రాజమండ్రిలో సమావేశం అవ్వడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా కాపులకు రావలసిన రిజర్వేషన్ల గురించో లేదంటే కాపు కార్పొరేషన్ నిధుల గురించి ఈ ప్రభుత్వాన్ని అడుగుదామని సమావేశమై ఉంటే మేమందరం హర్షించి ఉండేవాళ్లం కాని వీళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ కి ప్రజలలో పెరుగుతున్న అపారమైన ఆదరణ, ఒక కాపు కులస్తుల్లోనే కాకుండా ఇతర కులస్తుల్లో కూడా అపారమైనటువంటి ఆదరణ చూసి తట్టుకోలేని ఈ వైసీపీ ప్రభుత్వం తాడేపల్లి నుంచి ఒక స్క్రిప్ట్ రాగానే ఈ వైసీపీ పాలి కాపులు పవన్ కళ్యాణ్ ని తిట్టడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ రంగాని చంపిన పార్టీకి మద్దతు ఇస్తున్నారు అంటున్నారు మీకు ఎవరు చెప్పారయ్యా పార్టీకి మద్దతు ఇస్తున్నారని, ప్రజాస్వామ్యపరంగా పోరాటం చేయడానికి కలిసారు తప్పితే పొత్తుల గురించి మీకు ఎవరికైనా ఫోన్ చేసి చెప్పారా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా రంగా బ్రతికుండగా మనం ఏమి చేయలేకపోయాము కనీసం బ్రతికున్న పవన్ కళ్యాణ్ ను అయినా సరే ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఈ వైసీపీ పాలి కాపులకు చిత్త శుద్ధి లేదు, మీరు చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ని కాపు కులస్తులే కాకుండా అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా ఏకధాటిగా వచ్చి ముఖ్యమంత్రిని చేస్తారని గమనించుకోండి. ఇకనైనా మీరు ప్రజల్లోకి వెళ్లినప్పుడు కళ్యాణ్ ని తిట్టకుండా పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఈ వైసీపీ పాలి కాపులు అందరు కూడా ఆలోచించాలి. అదేవిధంగా కులాలను మతాలను కలుపుకుంటూ పోయే పార్టీ జనసేన పార్టీ అయితే కులాలను విడగొట్టి మతాలను విడగొట్టి పబ్బం గడిపే పార్టీలో మన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వాళ్లందరికీ గడ్డుకాలం వచ్చింది విచక్షణ జ్ఞానం కోల్పోయి రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలన్నీ కూడా బెడిసి కొట్టే సమయం 2024 లో ఉందని తెలియజేస్తున్నాము. వాళ్లందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారిస్తే మీరు మాత్రం కులాంధ్రప్రదేశ్ కరప్షన్ ఆంధ్రప్రదేశ్ గా మీరు మార్చారు వేటన్నిటిని కూడా జనసేన తరఫునుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని డాక్టర్ శ్రీధర్ పిల్లా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బాలిపల్లి అనిల్, వెలుపల చక్రధర్ రావు, పలనాటి మధు, బొమ్మిడి వీరబాబు, బీజేపీ నాయకులు పిల్లా ముత్యాలరావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.