తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు రిలీజ్

ఆగస్టు 31న ఈ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిoది. ఈ ప్రవేశపరీక్ష ద్వారా డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసినవారికి ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలోకి ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కల్పిస్తుంది.

తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్‌) ఫలితాలను టీఎస్ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్‌లో ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 90.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌) అంశాల్లో గత నెల (ఆగస్ట్‌) 31న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్‌ చేసుకోగా 25,448 మంది హాజరయ్యారు. అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి విద్యార్థులు ర్యాంక్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.