యాడికి మండలంలో తెలుగుదేశం – జనసేన ఇంటింటా ప్రచారం

తాడిపత్రి నియోజకవర్గం: జనసేన మరియు తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీకాంత్ రెడ్డి కదిరి & అష్మిత రెడ్డి జేసీ ఆదేశాల మేరకు యాడికి పట్టణంలోని 1 మరియు 2 వార్డులకు చెందిన పూలతోట, పాండురంగ స్వామి కాలనీ, చిన్న వేపమాను వీధి, కొండ కింద వీధి, రజక వీధి, అంత్రాల వీధి, శివాలయం వీధిలలో జనసేన & తెలుగుదేశం పార్టీ ప్రకటించిన “సూపర్ సిక్స్” పథకాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో జెసి అష్మిత్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారాన్ని యాడికి మండల తెలుగుదేశం – జనసేన నాయకులు మరియు కార్యకర్తలు కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, తెలుగుదేశ మండల నాయకులు చవ్వ గోపాల్ రెడ్డి, జనసేన మండల కన్వీనర్ సునీల్, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, మధు ఆచారి, మల్లికార్జున, రాజేష్, రఫీ, తెదేపా నాయకులు రామచంద్ర రెడ్డి, తిరం పురం నీలకంఠ, నరసింహ చౌదరి,నీలకంఠ రెడ్డి, గండికోట లక్ష్మణ్, రఘు రాముడు, మధురాజు, బొట్టు శేఖర్, విక్రమ్, నారాయణ స్వామి, విజయ్, గోపి, కంబగిరి, నాగేంద్ర, హరి, కోదండ రావు, హాజి మస్తాన్, చలపతి, వాసు, పాండు, చంద్ర శేఖర్, డేవిడ్, బాలు, నరసింహ, లియో రాజబాబు, తిరు, యువరాజ్, కుమార్ స్వామి, కార్తీక్, బాబు పాల్గొన్నారు.