భైరవ స్వామికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

రోడ్డు ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడిన ఆలమూరు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కోలాటి భైరవ స్వామికి అండగా నిలిచిన వైసిపి కలవచర్ల గ్రామ ప్రముఖ శెట్టిబలిజ నాయకులు వనుము శ్రీనివాసరావుకు అభినందనలు! ఆలమూరు మండల ప్రెస్ సభ్యులు రాయుడు లక్ష్మణరావు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం లోని, ఆలమూరు మండలం నందు కలవచర్ల గ్రామానికి చెందిన ప్రముఖ శెట్టిబలిజ మండల నాయకులు కలవచర్ల గ్రామ వైసిపి నాయకులు వనుము శ్రీనివాసరావు, ఇటీవల ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు కే. స్వామికి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతూ 2000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం ఎంతో ఒక గొప్ప మానవత్వము గా భావించాలని, ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ జర్నలిస్టు స్వామికి, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడి, ఆ జర్నలిస్టు వారికి మేమున్నామని, గుండె ధైర్యాన్ని ఇవ్వాలని, ఇప్పటివరకు చేయూతనిచ్చిన, ప్రముఖులకు, పలువురు దాతలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా పాదాభివందనాలు తెలియజేస్తూ, మరొక్కసారి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రెస్ మీడియా తరఫున, స్వామి కుటుంబ సభ్యుల తరఫున అందరికీ పేరుపేరునా ప్రతి ఒక్కరికి ఘనంగా పాదాభివందనాలు తెలియజేయడం జరిగింది.