పవన్ కళ్యాణ్ పై హత్య ప్రయత్నం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం

పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామం, 88వ వార్డ్, జనసేన పార్టీ నాయకులు వబ్బిన శ్రీకాంత్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని హత్య చేయడానికి సుమారు 250 కోట్లు సుపారీ తీసుకొని, గత 3 నెలల నుంచి రక్కి నిర్వహించి కడప జిల్లాల పర్యటనలో కూడా హత్య చేయడానికి భారీ కుట్ర జరిగిన విషయాన్ని కేంద్ర ఇంటిలిజెన్స్ వారు తెలియజేశారని మీడియాలో చూపించడాని చాలా బాధాకరమైన విషయమని, పవన్ కళ్యాణ్ హత్య చేయడానికి సుమారు 250 కోట్లు సుపారీ తీసుకోవడం, అది కూడా కడప జిల్లాలో హత్య చేయడానికి ప్లాన్ చేయడాన్ని ప్రజలందరూ గమనించాలని, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంగా భావిస్తున్నానని, పవన్ కళ్యాణ్ కి రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతుందని, ప్రజలందరూ పవన్ కళ్యాణ్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని ఇలాంటి టైం లో పవన్ కళ్యాణ్ హత్య చేసినట్లయితే పాలక నాయకులను ఎదిరించడానికి ఎవరూ ఉండరని భావిస్తున్నారని, పవన్ కళ్యాణ్ భావజాలం కులాన్ని కలిపే ఆలోచన విధానం, అవినీతి రహిత పాలన, ఓటుకు డబ్బు మద్యం పంచకుండా ప్రజల కోసం సేవ చేసే నాయకులు కావాలని ప్రజలందరూ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్నారు కావున ఇటువంటి నాయకుడు సమాజానికి చాలా అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో ఇటువంటివి ఏమీ జరగకుండా తక్షణమే పవన్ కళ్యాణ్ కి భారీ భద్రత ఏర్పాటు చేయాలని లేనియెడల భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పవన్ కళ్యాణ్ పై జరిగినా వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రభుత్వాలకు వినిపించేలాగా వారికి తెలిసేలాగా సోషల్ మీడియాలో #APNeedsPawanKalyan #ZPlusSecurityForPawanKalyan పెట్టి పవన్ కళ్యాణ్ పై హత్యా కుట్రను వ్యతిరేకించాలని కోరడం జరిగింది.