డంపింగ్‌ యార్డును తక్షణమే తరలించాలి

పాలకొండ, నగర పంచాయతీ 20వ వార్డు పరిధి తెలుకవాని చెరువు గట్టుపై తాత్కాలికం పేరుతో ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డును తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం మూడు వార్డు ప్రజలు ర్యాలీగా నగర పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు గంటా సంతోష్, సిఐటియు నాయకులు దావల రమణ, బిజెపి పట్టణ అధ్యక్షులు కారేపు చిట్టిబాబు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.