యువతకు క్రికెట్ కిట్స్ పంపిణి చేసిన మాడుగుల జనసేన పార్టీ

మాడుగుల: ఎం.గదబూరు యువతకు క్రికెట్ కిట్స్ పంపిణి చేసిన మాడుగుల జనసేన పార్టీ. మాడుగుల పంచాయతీలో మాడుగుల నియోజకవర్గ యువ నాయకులు రాయపురెడ్డి కృష్ణ ఆర్థిక సహాయంతో గండేం రాంబాబు చేతుల మీదుగా మాడుగుల మండల జనసైనికులకు క్రికెట్ కిట్స్ అందజేత. యువత విద్యతో పటు క్రీడల్లో కూడా రాణించాలని మాడుగుల మండల జనసేన పార్టీ వారు ం.గదబూరు యువతకు క్రికెట్ కిట్స్ ను పంపిణి చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర ధారుడ్యానికి దోహద పడుతున్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపై నెపుణ్యాన్ని సాధించి మంచి క్రీడాకారులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో కోన దుర్గా శ్రీనివాస్, రౌతు ప్రసాద్, కొడా మహేష్, కలిపిరెడ్డి రాజా, మాలి, ఆర్లి రాజేష్ మరియు మాడుగుల మండల జనసైనికులు పాల్గొన్నారు.