విశాఖ ఉక్కు.. మనందరి హక్కు: డా:యుగంధర్ పొన్న

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఆదివారం వెదురుకుప్పం మండలం గొడుగుచింత పంచాయతీ ఎదుట విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదాలతో ప్లకార్డులతొ నిరసన తెలపటం జరిగింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ యుగంధర్ పొన్న సూచన మేరకు ఆ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎందరో మహనీయుల ఉద్యమాల ఫలితంగా సాధించుకోవడం జరిగిందని, ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షమందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఇప్పటికే తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్లి ఉక్కు పరిశ్రమ ఉద్యోగులకు అండగా నిలబడ్డారని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పై అధికార పార్టీ పార్లమెంటు సభ్యుల గళం విప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమ ను కాపాడుకునేందుకు ఎంపికలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీరు పట్ల ప్రశ్నించేలా ప్లకార్డులు ఉద్యమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కోలార్ వెంకటేష్, మండల అధ్యక్షులు పురుషోత్తం, మండల నాయకులు, సతీష్, ముని, ప్రతాప్, ముని సుధాకర్ వినోద్ గురుమూర్తి పురుషోత్తం షణ్ముగం వర్మ రాజ్ రుద్ర లోకేష్ జానకిరామ్ వెంకటాద్రి నాయుడు చిరంజీవి పాల్గొన్నారు.