పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారు: బొబ్బేపల్లి సురేష్ బాబు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గురువారం బొబ్బేపల్లి సురేష్ బాబు నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం ఎర్రగుంట నందు పేదలకిచ్చే ఇళ్ల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ బాబు మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో స్థానిక అధికార పార్టీ నాయకులు రూ.కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఏదైతే పేదలకోసం 218 ప్లాట్లను కేటాయించారో.. అందులో నాలుగు ప్లాట్లు పబ్లిక్ కి సంబంధించిన కార్యకలాపాలకు కేటాయించగా మిగిలిన 214 ప్లాట్లలో 88 ఫ్లాట్లు మాత్రమే పేదలకు పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన 126 ప్లాట్లలలో సగటికీ పైగా ప్లాట్లు స్థానిక అధికార పార్టీ నాయకులు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. మిగిలిన ఫ్లాట్లలను వారి అనుచరులకు పంచే ప్రక్రియలో ఉన్నారు. అంటే పేరు పేదలకోసం.. దోచుకునేది అధికార పార్టీ నాయకులు. ఇక్కడ చూస్తే పేదవాడికి ఇచ్చే ఇంటి స్థలంలో ఇల్లు నిర్మాణం జరగాలంటే పట్టా ఇవ్వాలి. అదేవిధంగా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ రెండూ ఉంటేనే ఇల్లు నిర్మాణం జరగాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి 126 ప్లాట్లలో 90% పొజిషన్ సర్టిఫికేట్ లేకుండానే ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. అంటే ఇక్కడ స్థానికులకి అర్హులైన వారికి ఇళ్లస్థలాలు ఇవ్వకుండా బయట వ్యక్తులకు మీ అనుచరులకు దోచి పెడుతున్నారా..? ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారికి తెలియదేమో మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. అవినీతికి పాల్పడ్డ వారిని మీరు కఠినంగా చర్యలు తీసుకొని, ఎవరైతే ఎర్రగుంట గ్రామానికి చెందిన అర్హులైన పేదలకు పక్కా ఇళ్ల పంపిణీ చేస్తారా.. లేదంటే మేము ఆ గ్రామస్థులకు అండగా ఉండి అర్హులైన వారికి పక్కా ఇల్లు పంపిణీ చేసే వరకు పోరాటం చేయమంటారా..? అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టంనుసారం దోచుకుంటే మేము చూస్తూ ఊరుకోం. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఇళ్ళు నిర్మించుకోవచ్చా..? ఎర్రగుంట లేఅవుట్లో అదే జరిగింది. లేఅవుట్లో నిజమైన అర్హులకు కాకుండా స్థానిక అధికార పార్టీ నాయకుల బినామీలకు, పోలీస్ సిబ్బందికి ప్లాట్లు కేటాయించి ఉన్నారు. వారు వాటిలో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని వున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి సొంత ఇంటి కల నెరవేరుస్తామని ప్రగల్బాలు పలికారు. మరి ఈరోజు జరుగుతున్న అవినీతిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఇదేనా మీ పరిపాలన మీరే చెప్పారు అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మరి రూ.కోట్ల రూపాయలు అవినీతి జరిగింది వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో.. లేదో చూస్తాం.. మీరు తీసుకుంటారా లేదా మమ్మల్ని పోరాటం చేయమంటారా..? అదేవిధంగా ఈ అవినీతికి పాల్పడిన వారిపై వెంకటాచలం మండల అధికారులు, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రహీం భాయ్, శ్రీహరి, గిరీష్, రహమాన్, వంశీ తదితరులు పాల్గొన్నారు.