వైసీపీ ప్రభుత్వం ఆర్భాటం ఆకాశానికి.. అభివృద్ధి పాతాళానికీ

కొండేపి నియోజకవర్గం: ప్రకాశం జిల్లా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి శూన్యం. సింగరాయకొండ గ్రామపంచాయతీలో అభివృద్ధికి నోచుకోక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. నాయకుల ఆర్భాటం ఆకాశానికి.. అభివృద్ధి పాతాళానికి అన్నట్లుగా సింగరాయకొండ గ్రామపంచాయతీ ప్రధమ స్థానంలో నిలిచినది అని ప్రజలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. సింగరాయకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ తాటీపత్రి వనజ ను సింగరాయకొండ గ్రామ ప్రజలు అత్యధిక ఓట్ల వేసి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలబెట్టినా.. సింగరాయకొండను అంధకారంతో కూడిన అపరిశుభ్రమైన మురికివాడగా అభివృద్ధి చేసిందని ప్రజలు జనసేన పార్టీ వద్ద వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ గతంలో కార్యదర్శి శరత్ చంద్రకి, సింగరాయకొండ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్న పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చినప్పటికీ.. సమస్యలను పరిష్కరించకపోగా గ్రామ ప్రజల సమస్యలను, పరిష్కరించినట్లుగా పై అధికారులకు తెలియజేస్తున్నారు. సింగరాయకొండ గ్రామ పంచాయతీలో విధి లైట్లు, పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, పలు సమస్యలపై కార్యదర్శి, మరియు ఈ.వో. పీ.ఆర్డి అంజలి దేవి వారం రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలు పట్టీ పట్టనట్లుగా మొద్దు నిద్రపోవడం చాలా బాధాకరం. సింగరాయకొండలో కొల్లూరు సత్యం వీధి జి.ఎస్.ఆర్ కళ్యాణమండపం దగ్గరలో సెంటర్ డ్రైనేజీ పై వేసిన బండ పగిలి ఆ వీధిలో చిన్న పిల్లలు ట్యూషన్ కీ వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు పగిలిన మాన్ వాల్ లో పడి కాళ్లు విరిగే ప్రమాదం ఉందని, జనసేన పార్టీ పగిలిన మాన్ వాల్ ను ఫోటోల ద్వారా తెలియజేసినప్పటికీ పట్టించుకోకుండా పిల్లల ప్రాణాలతో చలగాటం ఆడే సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్రపై డి.ఎల్.పి.ఓ మరియు జిల్లా (మేజిస్ట్రేట్) కలెక్టర్ సింగరాయకొండ పంచాయతీ కార్యదర్శి శరత్ చంద్రపై తక్షణమే చర్యలు తీసుకొని చిన్నపిల్లల ప్రాణాలు కాపాడవలెననీ పై సమస్యలపై వెంటనే స్పందించ గలరని జనసేన పార్టీ నుండి విజ్ఞప్తి చేయడం జరిగింది.